దళిత మహిళను స్తంభానికి కట్టేసి కొట్టిన మరో సామాజికవర్గం..
ఘర్షణకు దిగిన దళితులు..
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. మహిళకు విముక్తి..
AP Crime: పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఇంట్లో వాళ్లకి.. స్నేహితులకు కష్టాలు అంటే ఇదేనేమో.. కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తల్లిని పట్టుకుని స్తంభానికి కట్టి చిత్ర హింసలకు గురిచేశారు.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.. మరోవైపు.. ఈ ఘటనలో కులం కుంపటి పెట్టింది.. ఆధునిక సమాజంలో ఓవైపు అంతా సమానమే.. కులాలు లేవు.. మతాలు లేవు అని నేతలు స్పీచ్లు ఇస్తున్నా.. రియల్ లైఫ్ మాత్రం అవి ఆచరణకు ఆమడ దూరంగా ఉన్నాయి.. ఓ దళిత యువకుడు.. మరో వర్గం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో.. దళితుడైన ఆ యువకుడి తల్లిని పట్టుకుని చిత్రహింసలు పెట్టింది మరోవర్గం..
కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దళితైడన ఈరన్న అనే యువకుడు.. మరో వర్గానికి చెందిన నాగలక్ష్మి అనే యువతిని ప్రేమించాడు.. రెండు కుటుంబాల్లో వారి ప్రేమకు అడ్డంకులు వచ్చాయి.. అయితే, పెళ్లిచేసుకుని ఊరి నుంచి వెళ్లిపోయింది ఆ జంట.. ఈ నేపథ్యంలో.. దళిత మహిళ గోవిందమ్మను గురువారం రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు మరో సామాజిక వర్గీయులు.. దీంతో.. విడిపించేందుకు దళితులు ప్రయత్నించారు.. ఈ ఘటనలో దళితులు, ఇతర వర్గాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు.. దీనికి కారణం ఆరు నెలల క్రితం దళితుడైన ఈరన్న.. మరో సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే అంటున్నారు.. అబ్బాయి తల్లిదండ్రులు గ్రామంలో ఉండకూడదని ఇతర వర్గాలు ఆదేశాలు జారీ చేయడంతో.. ఘర్షణ మొదలైంది..
Also read
- బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
- Hyderabad : మరో అమ్మాయితో లవర్ కి పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!
- Andhra: కియాలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్
- Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
- ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..