హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠాను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న 60మందిని గుర్తించారు. హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట దందా చేస్తున్నట్లు తెలిపారు.
Cyber Crime: హైదరాబాద్ నగరంలో నకిలీ కాల్ సెంటర్ ముఠా భారీ దోపిడికి పాల్పడింది. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న 60 మందిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట దోపిడీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన మనస్విని కైవాన్ పటేల్, ప్రతీక్, రాహుల్ అనే వ్యక్తులతో సహా 60 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు
విదేశీయులే టార్గెట్..
నార్త్ నుంచి వచ్చిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల ఆశచూపి మనస్విని టెలీకాలర్లుగా నియమించుకుంది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని నిందితులు మోసాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 52 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు సేకరించి నగదు దోచేస్తారు. ఇలాంటి వారి మాయలో పడొద్దంటూ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎవరైనా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఫోన్ కాల్స్ వస్తే నేరుగా బ్యాంక్ లేదా పోలీసులను సంప్రదించాలని చెప్పారు
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




