పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేసిన పనులకు ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు చిన్నారులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలతో నడిపిన యవ్వారం అనుకోని విషాదానికి దారితీసింది.
ప్రస్తుత సమాజంలో మనుషులు రోజురోజుకు మరీ బరితెగించి పోతున్నారు. ఒకే సమయంలో ఇద్దరి ముగ్గురితో సంబంధాలు పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వారి వేధింపులతో బాధితులే ప్రాణాలు తీసుకునే పరిస్థితికి తెస్తున్నారు. అలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడి చేష్టలకు ఓ వివాహిత బలైంది. ఇద్దరు చిన్నారులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎలుకల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు కారణమైంది. 23 ఏళ్ల ఓ మహిళ అదే ఊరికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఈ సంబంధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ వీడియో కాల్స్ మాట్లాడడం, ప్రైవేట్ వీడియోస్ పంపిచుకోవడం చేసుకున్నారు. ఇలా వీరి మధ్య సంబంధం కొనసాగుతుండగానే ఆ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ అతన్ని ప్రశ్నించింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.తనను వదిలేయాలని లేదంటే తన దగ్గర ఉన్న ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ వ్యక్తి మహిళను బెదిరించాడు. అయినా ఆ మహిళ వినకపోవడంతో… ఆ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన మహిళ ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యాలనికి పాల్పడింది. ఆమె మరణం తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన స్థానికులు నిందితుడు నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





