Andhra Pradesh: విశాఖపట్నం నిమ్మకాయల శ్రీనివాసరావు మూడవ వ్రతం అనకాపల్లి జిల్లా దేవరపల్లి కి బతుకుదెరువు కోసం వెళ్ళిపోయారు. అతనికి భార్య ఉషారాణి, 18 ఏళ్ల కూతురు మేఘన ఉన్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘనకు అనారోగ్యం. తరచూ ఫిట్స్ తో బాధపడుతూ ఉండేది. మంగళవారం కూడా ఫ్రెండ్స్ తో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కింద పడిపోయింది. ఎంత లేపినా లేకపోయేసరికి.. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వైద్యుల్ని పిలిచి పరీక్షించారు. వైద్యుడు పరిశీలించాక మేఘన ప్రాణాలు కోల్పోయినట్టు ధ్రువీకరించారు.
Andhra Pradesh: ఒకగాను ఒక కుమార్తె.. మానసిక దివ్యంగురాలు. అయినప్పటికీ అల్లారు ముద్దుగా పెంచారు. కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లిదండ్రులు. అనారోగ్యంతో అప్పుడప్పుడు ఆమె ఫిట్స్ తో కింద పడిపోతూ ఉంటుంది. ఎప్పుడో మళ్లీ సాధన స్థితికి చేరుకొనే కూతురు.. ఇప్పుడు మళ్లీ తిరిగి లేవలేదు. ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు రోదించారు. తన కూతురు మరణ వార్త బంధువులకి ఫోన్లో చెబుతూ తల్లడిల్లింది ఆ తల్లి. మాట్లాడుతూనే కుప్పకూలిపోయింది. కూతురిని తలచుంకుంటూనే అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయిందా ఆ తల్లి. అప్పటివరకు తనతో కలిసి ఉన్న కుమార్తె, భార్య నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోవడంతో.. వారి మృతదేహాల వద్ద తల్లడిల్లిపోతున్న ఆ భర్తను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నిమ్మకాయల శ్రీనివాసరావు మూడవ వ్రతం అనకాపల్లి జిల్లా దేవరపల్లి కి బతుకుదెరువు కోసం వెళ్ళిపోయారు. అతనికి భార్య ఉషారాణి, 18 ఏళ్ల కూతురు మేఘన ఉన్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘనకు అనారోగ్యం. తరచూ ఫిట్స్ తో బాధపడుతూ ఉండేది. మంగళవారం కూడా ఫ్రెండ్స్ తో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కింద పడిపోయింది. ఎంత లేపినా లేకపోయేసరికి.. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వైద్యుల్ని పిలిచి పరీక్షించారు. వైద్యుడు పరిశీలించాక మేఘన ప్రాణాలు కోల్పోయినట్టు ధ్రువీకరించారు.
అప్పటివరకు తమ కళ్ళ ముందు ఉన్న కుమార్తె ఇలా విగత జీవిగా మారడాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. కూతురు మరణ వార్తను బంధువులకు ఫోన్లో చెబుతూనే కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామాన్ని చూసిన స్థానికులు.. ఉషారాణి స్పృహ తప్పి పడిపోయిందని అనుకున్నారు. ముఖంపై నీళ్లు చల్లి లేపేందుకు ప్రయత్నించారు. ఎంతకీ లేవకపోవడంతో మళ్లీ వైద్యుడిని పిలిచారు. పరీక్షించిన వైద్యుడు ఆమె కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. దీంతో అప్పటికే కూతురు మరణంతో తీవ్ర ఆవేదనకు లోనైన తండ్రి శ్రీనివాసరావు.. నిమిషాల వ్యవధిలోనే భార్య కూడా తనను విడిచి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని తెలుసుకొని తలడిల్లిపోయాడు. భార్య కూతురు లేని జీవితం ఇక తనకు ఎందుకంటూ గుండె లవి సేలా రోదించాడు. ఈ దృశ్యాలు అందరినీ కలచి వేశాయి. ఒక ఇంట్లో నిమిషాల వ్యాధిలో తల్లి కూతుర్ల ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. ఏ కుటుంబానికి ఎటువంటి కష్టం రాకూడదని అందరినీ కంటతడి పెట్టించింది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం