November 21, 2024
SGSTV NEWS
Crime

భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి

భర్తతో విభేదాల కారణంగా కొడుకు తుపాకితో కాల్చిన తల్లి.. తానూ కాల్చుకుని చనిపోయింది. మెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళితే.. 32 ఏళ్ల సవన్నా క్రిగర్ కి తన భర్తతో విభేదాలు వచ్చాయి. విడాకుల అనంతరం కొడుకు ఎవరి దగ్గర ఉండాలనే విషయంలో కోర్టు కేసు నడుస్తోంది. మూడేళ్ల కొడుకు కైడెన్ కస్టడీకి సంబంధించి గురువారం ఫైనల్ హియరింగ్ ఉంది. కాగా.. క్రిగర్ బుధవారం ఉదయమే లేచిన గబగబా రెడీ అయి, కొడుకు కైడెన్ ను డే కేర్ సెంటర్ లో దింపేసింది. తాను ఆఫీస్ కు బయల్దేరింది. అక్కడ హెచ్ ఆర్ ను కలిసి, తన జాబ్ కి సంబంధించి రాజీనామా పత్రాన్ని ఇచ్చింది. తన క్యాబిన్ లోకి వెళ్లి, ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇతర వస్తువులు తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి నేరుగా తన మాజీ భర్త, గతంలో తాము కలిసి ఉన్న ఇంటికి వెళ్లింది. అప్పటికే, ఫ్లాట్ కు తాళం వేసి ఆమె భర్త ఆఫీస్ కు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న మారు తాళం చెవితో ఇంట్లోకి వెళ్లిన సవన్నా.. అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను చింపేసింది. తమ పెళ్లి నాటి వెడ్డింగ్ గౌన్ ను బయటకు తీసి బెడ్ పై వేసి తగలపెట్టింది.


ఆ తరువాత అక్కడి నుంచి డైరెక్ట్ గా తన కొడుకు ఉన్న డే కేర్ సెంటర్ కు వెళ్లి, కొడుకు కైడెన్ ను పికప్ చేసుకుంది. తనను తీసుకుని, తను ఉంటున్న ఇంటి సమీపంలోకి చిన్న పార్క్ లోకి వెళ్లింది. పార్క్ లో కాస్త నిర్మానుష్యంగా ఉన్న చిన్న గుంత లాంటి ప్రదేశంలోకి వెళ్లి, ఒక చిన్న చెట్టు కింద కూర్చుంది. ఆ తరువాత తన ఐ ఫోన్ తీసుకుని తన మాజీ భర్తకు ఫేస్ టైమ్ లో కాల్ చేసింది. ఫోన్ కెమెరాను తన కుమారుడి ఫేస్ ముందు ఉంచి.. ‘‘డాడీకి గుడ్ బై చెప్పు’’ అన్నది. తండ్రి ముఖం చూడగానే తన తల్లి ఉద్దేశం అర్థ కాని ఆ చిన్నారి నవ్వుతూ తండ్రికి గుడ్ బై చెప్పింది. ఆ వెంటనే, సవన్నా తన బ్యాగ్ లో నుంచి పిస్టల్ ను తీసి, తన కొడుకుకు ముద్దు పెట్టి, సారీ చెబుతూ, గురిపెట్టి కాల్చేసింది. క్షణాల్లో ఆ చిన్నారి విగతజీవిగా మారిపోయాడు. ఆ వెంటనే, తన నుదిటిపై కాల్చుకుని ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా కళ్లారా చూసిన ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులకు పార్క్ లోని ఒక మూల తల్లీ, కొడుకుల మృతదేహాలు కనిపించాయి. సవన్నా క్రిగర్, తన కుమారుడు కైడెన్ గా గుర్తించారు.

Also read

Related posts

Share via