మూఢనమ్మకం అక్కా, తమ్ముడు ప్రాణాలను బలితీసుకుంది. ఆరోగ్యం బాగాలేదని దర్గా బాబా దగ్గరికి వెళితే నదిలో మునిగి తాయెత్తులు కట్టుకోమని సలహా ఇచ్చాడు. బాబా చెప్పిన సలహా మేరకు వెళ్లే దారిలో నదిలో మునిగిన అక్కా, తమ్ముడు అనంతలోకాలకు వెళ్లిపోయారు. నంద్యాల జిల్లా, చాగలమర్రి టౌన్కు చెందిన షేక్ ఖాజా హుస్సేన్, అతని భార్య షేక్ ఇమామ్ బీ, బావమరిది అయిన ఫకీర్ మస్తాన్లు ముగ్గురు కలిసి షేక్ ఇమాంబి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కడప జిల్లాలోని ఎర్రగుంట్ల దర్గా వద్ద పూజలు చేయించుకుని తాయిత్తులు తీసుకున్నారు. అలానే తాయత్తులను ఏదైనా నదిలో మునిగి కట్టుకుంటే మంచిదని దర్గాలో బాబా చెప్పాడు. ఆయన మాటప్రకారం తిరిగి చాగలమర్రికి పోతూ రాజుపాలెం మండలం కూలూరు గ్రామం వద్ద కుందునదిలో మునిగి చాగలమరికి పోదామని షేక్ ఇమాంబి చెప్పగా కుందునది వద్దకు ముగ్గురు వెళ్ళారని ఇంమాంబి భర్త పోలీసులకు తెలిపారు.
అయితే షేక్ ఖాజా హుస్సేన్ కుందునది కట్టపై ఉండగా ఆయన భార్య అయినా షేక్ ఇమాంబి( 27) ఆమె తమ్ముడు ఫకీర మస్తాన్ (26 ) నీటి వద్దకు వెళ్లి అందులో మునగగా ప్రమాదవశాత్తు కుందునది లోతులో మునిగి ఊపిరాడక చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. వారు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారని నీటి ఒడ్డునే ఎక్కువ లోతు ఉండడం దీనికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఇసుక తవ్వకం వల్లే గుంటలు పడి వీళ్లు మునిగిపోయినట్లు చెబుతున్నారు. అక్క, తమ్ముడు నీటిలో మునిగిపోవడంతో సమీపంలోని కొందరు ఈతగాళ్ళను పీలిచి మునిగిపోయిన అన్నా, చెల్లెలు మృతదేహాలను బయటికి తీశారు. అయితే అప్పటికే వారు మృతి చెంది ఉండడంతో జరిగిన సంఘటనపై ఖాజా హుస్సేన్ ఫిర్యాదు మేరకు రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మూఢనమ్మకం మరో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మూఢనమ్మకాలను పక్కన పెట్టాలని ఆశిద్దాం.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్గా చేస్తే సూపర్ ఇన్కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!