July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

రంజాన్ వేళ కత్తుల వేట.. షాక్‎కు గురైన స్థానికులు.. కేసు నమోదు..

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రంజాన్‌ పండగ వేళ కత్తుల దాడి కలకలం రేపింది. ఒకే వర్గానికి చెందిన యువకుల మధ్య తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి.. కత్తులతో ఘర్షణకు దిగడం సంచలనం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించి ఓ వర్గానికి చెందిన యువకుల మధ్య డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ కత్తుల దాడికి దారి తీసింది. ఈ దాడిలో ఇద్దరు తీవ్రగాయాలు కాగా స్థానిక రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆదిలాబాద్ వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపూర పాఠశాల సమీపంలో ఐదుగురు యువకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కోలిపూరకు చెందిన అన్నదమ్ములు సయ్యద్‌ ముజాయిద్, సయ్యద్‌ షాహిద్‌లు అక్కడి నుండి ఓల్డ్ బస్టాండ్ సమీపంలోకి వచ్చి ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా.. అక్కడికి వచ్చిన పజ్జు అనే యువకుడు మరోసారి ఆ ఇద్దరు అన్నదమ్ములతో గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో వారి ఇద్దరిపై దాడికి పాల్పడి పరారయ్యాడు. ఈ దాడిలో ముజాయిద్‌కు కడుపుభాగంలో, కుడి చెయ్యికి గాయాలయ్యాయి. అడ్డువచ్చిన తమ్ముడికి సైతం స్పల్ప గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు బాధితులను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు రిమ్స్ వైద్యులు‌ తెలిపారు. రంజాన్ పండుగ వేళ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య దాడికి ప్రదాన కారణం ఏంటన్న కోణంలో కేసు‌నమోదు చేసుకుని దర్యాప్తు‌చేపట్టినట్టు వన్ టౌన్ సీఐ సత్యము తెలిపారు.

Also read

Related posts

Share via