హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా)
శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం ఎరుగని చిన్నారిని వరుసకు పెదనాన్న అయ్యే వ్యక్తి, సైకో అతిదారుణంగా కొట్టి చంపేసి పెన్నా నది ఇసుక మేటల్లో పూడ్చి పెట్టాడు. దీనికి ముందు బాలికపై అత్యాచారం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. శుక్రవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… హిందూపురం రూరల్ మండలం తూముకుంటకు చెందిన మంజులకు, పరిగి మండలం బీచగానిపల్లికి చెందిన నాగేంద్రకు గతంలో వివాహమైంది. ప్రస్తుతం వారికి కుమార్తె అనిత (8) ఉంది. రెండో కాన్పు నిమిత్తం మూడు రోజుల క్రితం కూతురుతో కలిసి తూముకుంటలోని తన అక్క రత్నమ్మ ఇంటికి మంజుల వచ్చింది. రత్నమ్మ భర్త గంగాధర్ శుక్రవారం ఉదయం అనితకు మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని పెన్నా నది వద్దకు తీసుకెళ్లి చిన్నారిని గొంతు నులుమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెన్నా నది ఇసుక మేటల్లో పూడ్చి పెట్టి ఏమీ తెలియని వాడిలా ఇంటికి వచ్చేశాడు. చిన్నారితో కలిసి వెళ్లిన వ్యక్తి ఒక్కడే ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు పాప కోసం గంగాధర్‌ను ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గంగాధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో చిన్నారిని హత్య చేసి, ఇసుక మేటల్లో పూడ్చినట్లు ఒప్పుకు న్నాడు. అడిషనల్ ఎస్‌పి విష్ణు, సిఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిం చారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానం?
బాలికపై గంగాధర్ అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇసుక మేట వద్దకు తీసుకెళ్లిన గంగాధర్ బాలికను అత్యాచారం చేయడంతో ఈ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. అత్యాచారం చేసి హత్య చేశాడా? లేక తన సైకో చేష్టలతో హత్య చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అడిషనల్ ఎస్‌పి విష్ణు తెలిపారు.
గతంలోనూ ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు కేసులు
నిందితుడు గంగాధర్ గత పదేళ్ల కాలంలో ఇద్దరు మహిళలను ఇదే తరహాలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాగరత్నమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని బండరాళ్లతో కొట్టి చంపేసినట్టు గతంలో కేసు నమోదైంది. హనుమక్క అనే మహిళను రాత్రి సమయంలో మాయమాటలు చెప్పి చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం దారుణంగా కొట్టి హత్య చేసినట్లు మరో కేసు ఉంది. వీటిలో వృద్ధ మహిళను హత్య చేసిన కేసును సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు కొట్టి వేసింది. మరో కేసు విచారణలో ఉంది. నిందితుడు గంగాధర్ బెయిల్‌పై ఈ ఏడాది జనవరిలో బయటకు వచ్చి ఇప్పుడు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు సైకో అని, తన చేష్టలతో తమను భయబ్రాంతులకు గురి చేసేవాడని గ్రామస్తులు చెప్తున్నారు
Also read
- Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న యువతి.. వెనకే వచ్చి పట్టుకున్న పట్టుకున్న వ్యక్తి.. కట్ చేస్తే..
- Software employee suicide: కాకినాడలో మరో బెట్టింగ్ బాధితుడు బలి.. తల, మొండెం వేరై
- AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..!
- DNA test: దివ్యాంగ సోదరిపై అత్యాచారం.. నాలుగేళ్లకు ‘డీఎన్ఏ’ పరీక్షలో దొరికిపోయి!
- ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య