టీచర్ ను ప్రేమ పేరుతో వేధించిన యువకుడు. కొంత కాలంగా ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. వేధింపులు ఎక్కువవడంతో యువ టీచర్ షాకింగ్ నిర్ణయం.. చివరకు ఏం జరిగిందంటే?
ప్రేమ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు పోకిరీలు. ప్రేమ పేరుతో వేధిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువైపోయాయి. ప్రేమ పేరుతో లోబర్చుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రేమించాలని వెంటపడుతూ దాడులకు తెగపడుతున్నారు. ప్రేమించడం లేదన్న అక్కసుతో చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రేమను అంగీకరించడం లేదని హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఓ యువకుడు టీచర్ ను ప్రేమ పేరుతో వేధించి చివరకు హత్య చేసిన విషయం తెలిసిందే.
స్కూల్లోనే కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇది మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ కారణంగా మరో టీచర్ బలైపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ టీచర్ ను పొట్టనపెట్టుకున్నాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భీమిలికి చెందిన కాగితాల రాశి అనే యువతి డిగ్రీ చదివుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామంలో నివసిస్తున్న పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో రాశిని వేధించాడు. కొంతకాలం నుంచి ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించాలని వేధించసాగాడు.
స్కూల్ కు వెళ్లేటపుడు, తిరిగి వచ్చేటపుడు ఆమెను ఫాలో చేస్తూ వేధిస్తున్నాడు. రోజు రోజుకు అతని ఆగడాలు ఎక్కువైపోయాయి. తనకు ఇష్టం లేదని తన వెంటపడొద్దని చెప్పినా అతడు వినిపించుకోలేదు. పిల్లి రాజు వేధింపులతో కాగితాల రాశి విసుగుచెందింది. భరించలేని స్థితికి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాశి మృతిచెందింది. రాశి మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కూతురు చావుకు కారణమైన ఆ యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025