SGSTV NEWS online
CrimeNational

అయ్యో పాపం.. కూతురిని హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ..



కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ.. తన 12 ఏళ్ల కూతురిని హత్య చేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆ మహిళ భర్త రాత్రి షిఫ్ట్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఇంటికి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. ఇంటిలో మృతదేహాలు బయటపడ్డాయి.


కర్ణాటకలోని శివమొగ్గలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెక్‌గాన్ హాస్పిటల్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఒక మహిళ, ఆమె కుమార్తె మృతి చెందారు. 38 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ల కుమార్తెను హత్య చేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్న ఆ మహిళ తన కూతురిని చంపి తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు


దావణగెరె జిల్లాలోని మాయకొండకు చెందిన శ్రుతి భర్త రామన్న మెక్‌గాన్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు . శ్రుతి భర్త రాత్రి షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని చూశాడు. ఆ తర్వాత అతను పొరుగువారి సహాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా… మృతదేహాలు బయటపడ్డాయి. 6వ తరగతి చదువుతున్న కుమార్తె పూర్విక తలకు గాయాలై కనిపించింది. శ్రుతి తన కూతురు శరీరం దగ్గర వేలాడుతూ కనిపించింది.

సమాచారం అందుకున్న శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ జికె మిథున్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దొడ్డపేట పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ సంఘటనలో రెండు కేసులు ఉన్నాయి.. ఒక హత్య మరొకటి ఆత్మహత్య. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రాథమిక నివేదికల ప్రకారం శ్రుతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది

Also read

Related posts