హైదరాబాద్ కూకట్‌పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. వెల్ విజన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రజలను నిండా ముంచింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.14 కోట్లు వసూలు చేసి చాప చుట్టేసింది. పెట్టిన పెట్టుబడికి ప్రతినెలా ఫ్రిడ్జ్, టీవీలు బోనస్‌గా ఇస్తామంటూ ఆశ చూపించి బురుడీ కొట్టించింది. కేవలం వడ్డా మాత్రమే కాకుండా పెట్టిన పెట్టుబడికి బహుమతులు కూడా ఇస్తామని ప్రకటనలు గుప్పించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు
హైదరాబాద్ కూకట్‌పల్లిలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. వెల్ విజన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రజలను నిండా ముంచింది. అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశచూపి రూ.14 కోట్లు వసూలు చేసి చాప చుట్టేసింది. పెట్టిన పెట్టుబడికి ప్రతినెలా ఫ్రిడ్జ్, టీవీలు బోనస్‌గా ఇస్తామంటూ ఆశ చూపించి బురుడీ కొట్టించింది. కేవలం వడ్డా మాత్రమే కాకుండా పెట్టిన పెట్టుబడికి బహుమతులు కూడా ఇస్తామని ప్రకటనలు గుప్పించింది. రూ.లక్షకు టీవీ, రూ.2 లక్షలకు వాషింగ్ మిషన్, రూ.3 లక్షలకు ఫ్రిడ్జ్‌లు ఇస్తామంటూ ప్రజలను నమ్మించిన వెల్ విజన్ ఇన్ ఫ్రా నిర్వాహకులు రాత్రికి రాత్రే ఉడాయించారు.
అధిక వడ్డీకి, అకర్షణీయమైన బహుమతులకు ఆశపడ్డ ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తీరా తాము మోసపోయామని గ్రహించిన తర్వాత, వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు. ఈ కేసులో భాగంగా పోలీసులు వెల్‌విజన్ కంపెనీ చైర్మన్ కందుల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఇతర బాధితులు కూడా ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సుమారు 200 మంది బాధితుల దగ్గరి నుంచి రూ.14 కోట్లు వసూలు చేశారు. 35 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా సావధానంగా ఉండాలని, అధిక వడ్డీ పేరుతో మోసాలు చేసే వారి పై విశ్వాసం పెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా, కూకట్‌పల్లిలో వెల్‌విజన్ కంపెనీ మోసం కేసు ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజల డబ్బులను తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also read
- Holi 2025: హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి.. జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి
- Hyderabad: వేకువజామున నీళ్లు కావాలని ఇంట్లోకి దూరాడు.. ఆమె లోపలికి వెళ్లగానే..
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..