November 22, 2024
SGSTV NEWS
CrimeNational

చూడముచ్చటైన జంట.. విధి ఆడిన వింత నాటకంలో.. అసలు ఏం జరిగిందంటే?

Wayanad Floods: ఇటీవలే వాయనాడ్ లో భారీ వరదలు ముంచెత్తిన క్రమంలో చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి తన  తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయింది. అయితే అందర్నీ కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో పిడుగులాంటి విషాదం చోటు చేసుకుంది.



ఏ మనిషికైనా జీవితంలో ఏదొక తోడు అనేది కచ్చితంగా ఉండాలి. అది తల్లి, తండ్రి, అన్నదమ్ములు, స్నేహితులు, భర్త ఇలా ఎవరైనా సరే.. మనకంటూ చెప్పుకోవడానికి ఒకరైనా ఉండాలి. కానీ, మనకంటూ ఎవరు లేని జీవితం.. ఊహించుకోవాడానికే భయంకరంగా ఉంటుంది. మరీ ఊహిస్తేనే ఇంత దారుణంగా ఉంటే.. నిజంగా అయినవాళ్లను అందర్నీ పొగొట్టుకుని నా అనే వాళ్లు లేక గడుపుతున్న ఆ జీవితం అంధకారంగా ఉంటుంది. సరిగ్గా కేరళకు చెందిన ఓ యువతి జీవితం కూడా ప్రస్తుతం ఇలానే ఉంది. ఇటీవలే వయనాడ్ వరదల్లో తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న శ్రుతి అనే అమ్మాయి గురించి ఇది వరకే మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఇలా కుటుంబం మొత్తం కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆ అమ్మాయికి మరోసారి విధి కన్నెర్ర చేసింది. అన్ని తానై జీవితాంతం తోడునీడగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తిని కూడా ఊహించని విధంగా దూరం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఇటీవలే వాయనాడ్ లో భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ వరదల్లో వయనాడ్  జిల్లా చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి (24) తన  తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయింది. అయితే కుటుంబం మొత్తాన్ని వరదల్లో కోల్పోయి పుట్టేడు దు:ఖంలో ఉన్న ఆమెకు జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ చిరకాల మిత్రుడు జెన్సన్ (27) మాట ఇచ్చాడు. కానీ, ఊహించని విధంగా విధి వక్రిభవించింది. ఈ ఇద్దరి ప్రేమ జంటలను విడదీసింది. ప్రాణంగా ప్రేమించిన తన మిత్రుడు, కాబేయ భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు.

కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనానికి ఓ ప్రైవేట్ బస్సు డీకొన్నది. అయితే ఈ ఘటనలో జెన్షన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జెన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తన చిరకాల మిత్రుడు, కాబోయే భర్త మృతి చెందడంతో శ్రుతి జీవితం మరోసారి తలకిందులైనట్లైంది.


ఒకవేళ అన్ని మంచి జరిగివుంటే.. అసలు వయనాడ్ లో వరదలే రాకుండా ఉంటే, తన కుటుంబ కూడా బ్రతికే ఉండేది. అలాగే ముందుగా అనుకున్న దాని తేదీ (జూన్2వతేదీన) ప్రకారం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి కూడా చేసుకునేది. కానీ, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందన్నట్టు.. ఇలా అందర్నీ దూరం చేసి ఆ యువతిని జీవితంలో తీవ్ర విషాదం మిగిలిపోయింది.

Also read

Related posts

Share via