AP News: రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో కొత్త మలుపు.. డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్..
హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు తీగ లాగితే దాని డొంక గుంటూరులో కదిలింది. గత కొంతకాలంగా వార్తల్లో ఉంటున్న పేరు మస్తాన్ సాయి. రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మొదటిసారి..
హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు తీగ లాగితే దాని డొంక గుంటూరులో కదిలింది. గత కొంతకాలంగా వార్తల్లో ఉంటున్న పేరు మస్తాన్ సాయి. రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మొదటిసారి మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని రాజ్ తరుణే స్వయంగా ఆరోపించాడు. ఆ తర్వాత మస్తాన్ పేరు పలుమార్లు వార్తల్లో నిలుస్తూ వచ్చింది.
గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో 2023లో లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి సోదరి పెళ్లి కోసం లావణ్యను గుంటూరుకు ఆహ్వానించాడు. ఆమె హోటల్‌లో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వెళ్లి ఆమెను కొట్టి ఆమె ఫోన్ లాక్కొని అత్యాచారయత్నం చేసినట్లు లావణ్య ఫిర్యాదు చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ పోలీసులు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పక్కా ఆధారాలు సేకరించిన సెబ్ పోలీసులు సోమవారం గుంటూరులో ఉన్న మస్తాన్ సాయిని పన్నెండు గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని కాంటాక్ట్స్‌పై దృష్టి పెట్టారు. మస్తాన్ సాయి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు.. సినిమా ఇండ్రస్ట్రీలో ఎవరితో పరిచయాలున్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మస్తాన్ సాయి అరెస్ట్‌తో అటు సినీ, ఇటు రాజకీయ రంగంలో చాలామంది పేర్లు బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతుంది.
వీడియో
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025