SGSTV NEWS
CrimeNational

Crime News: మహిళపై అఘాయిత్యం చేసి.. అపస్మారకస్థితిలో వదిలేసి..!



దిల్లీలో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు ఆమె అపస్మారక స్థితిలో ఉండగా వదిలి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.

దిల్లీ: దేశ రాజధాని నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ (34)పై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు ఆమెను ఢిల్లీలోని సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలో అపస్మారకస్థితిలో పడేసి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారు జామున 3.30గంటల సమయంలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ఎయిమ్స్ ట్రూమా సెంటర్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. వేరేచోట ఆమెపై లైంగికదాడి చేసి.. సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒడిశాకు చెందిన బాధితురాలు.. ఏడాది క్రితమే దిల్లీ నగరానికి వచ్చిందని తెలిపారు. కాట్వారియా సరై ప్రాంతంలో మరో మహిళతో కలిసి నివసిస్తుండగా.. వారి మధ్య గొడవల కారణంగా కొద్ది రోజులుగా ఆమె వీధుల్లోనే ఉంటోందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె గ్రాడ్యుయేట్ అని, గతంలో ఢిల్లీలోని జమూదుర్లో ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే, ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కిషన్జఢ్ ఏటీఎం బూత్లో కనబడిందని వివరించారు. ఆమె మార్చి మార్చి స్టేట్మెంట్ ఇస్తూ.. పోలీసుల దర్యాప్తునకు సహకరించడంలేదన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. ఈ ఘటనలో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts