సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం. కానీ, కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్‌పై.. అడ్డుకున్న సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ దాబాపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టీ సెల్ఫ్ సర్వీస్ ఉందని, సిబ్బంది చెప్పార. అయితే తమకు టీ సర్వ చేయడం లేదని ఆగ్రహం చెందిన నలుగురు యువకులు నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇదే క్రమంలో తమ స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో మరికొంతమంది యువకులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
హోటల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి, తిను బండారాలను నేలపాలు చేశారు. అడ్డుకున్న హోటల్ సిబ్బందిపై దాడులు చేస్తుండడంతో వినియోగదారులు భయబ్రాంతులకు గురై బయటకు వెళ్లిపోయారు. నిర్వాహకులపై భౌతికంగా దాడులు చేసిన వీడియో సిసి కెమెరాలో రికార్డు అయింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Also read
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….
- ఇలా తయారయ్యారేంట్రా..! టీ చేతికి ఇవ్వలేదని ఇంత దారుణమా..?
- Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..
- కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా.. తెగబడ్డ తెంపుడుగాళ్లు.. భయంతో వణుకుతున్న మహిళలు!
- సబ్‌రిజిస్ట్రార్ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!





