సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దొంగలు విజృంభిస్తున్నారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే ఆధ్యాత్మిక నిలయాలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సదాశివపేటలోని గురునగర్ కాలనీలో ఉన్న ప్రముఖ శ్రీ భవానీమాత ఆలయంలో మరోసారి హుండీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సదాశివపేటలో భవానీమాత ఆలయంలో వరుస చోరీలు స్థానికులను కలవరపెడుతున్నాయి..వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆలయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురునగర్ కాలనీలోని శ్రీ భవానీమాత ఆలయంలో మరోసారి హుండీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దొంగ ఆలయంలోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అర్థరాత్రి సమయంలో ఆలయంలోకి వచ్చిన దొంగ..హుండీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపిస్తోంది. ఘటనపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు..పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు..
అయితే ఇదే ఆలయంలో గతంలోనూ హుండీ చోరీ జరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా గత నెలలో గురునగర్ కాలనీలోనే ఓ బైక్ చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్న నేపథ్యంలో కాలనీలో భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఆలయంలో హుండీ చోరీ పునరావృతం కావడంతో ఆలయ భద్రత పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీ కెమెరాలున్నప్పటికీ దొంగతనాలు జరగడం, దొంగలు పదేపదే ఆలయాన్నే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నిందితుడిని త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Also read
- Hyderabad: రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్యాధికారి..!
- రీల్స్ క్రేజ్.. పచ్చని కాపురంలో చిచ్చు.. చివరికి ఊహించని విషాదం!
- ATM Robbery: నగరంలో భారీ చోరీ.. ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- Hyderabad: సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్!
- Hyderabad: షేక్‌పేట లేడీస్ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి





