సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన జిగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. పండగకు వచ్చిన కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇద్దరి యువకుల కుటుంబ సభ్యులుల గుండెలుపగిలేలా రోధించారు. పండగపూట చోటుచేసుకున్న ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో చదువుకుంటున్న జగిత్యాల జిల్లాకు చెందిన నవనీత్, సాయి, సృజన్ సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా పండుగ జరుపుకున్నారు. మరో రెండ్రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
అయితే తమ పక్క ఊర్లోనే ఉన్న మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లారు. అక్కడ మరో ఫ్రెండ్ తో కలిసి వింధు చేసుకున్నారు. తరువాత కార్‌లో ఇంటికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలోకి రాగానే ఓవర్ స్పీడ్ కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్థంబానికి ఢీకొట్టింది. అనంతరం డివైడర్ డీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన యువకులను హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే హాస్పిటల్‌లో వారిని పరీక్షించిన వైద్యులు నవనీత్, సాయి తేజ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉన్న సృజన్‌కు చికిత్స అందించారు.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి యాక్సిడెంట్ జరిగిన తీరున పరీక్షించి.. ఆధారాలు సేకరించారు. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఇద్దరు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





