ఉపాధ్యాయుడు అంటే తండ్రితో సమానం. పిల్లలను సొంత బిడ్డల వలె కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత టీచర్లదే. కానీ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ టీచర్ మాత్రం దారి తప్పి తప్పుడు పనులు చేయడం మొదలెట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని పాఠశాలలోనే చితకబాది పోలీసులకు అప్పగించారు.
స్కూల్ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ మతితప్పి ప్రవర్తించాడు. నిత్యం మద్యం తాగి వస్తూ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని చితకబాది బుద్ది చెప్పారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చింతపల్లి మండలం మాల్ ప్రాథమిక పాఠశాలలో దేవ్లా అనే టీచర్ పని చేస్తున్నాడు. ఇదే మండలంలోని తక్కెళ్ళపల్లిలో పోస్టింగ్ ఉండగా, డిప్యూటేషన్ పై 20 రోజులుగా మాల్ స్కూలుకు వస్తున్నాడు. అయితే దేవ్లా నిత్యం మద్యం మత్తులో పాఠశాలకు వచ్చేవాడు. స్కూల్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.
అయితే ఇటీవల కూడా ఓ నాలుగో తరగతి చదువుతున్న బాలికతో దేవ్‌లా అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం క్లాస్ రూమ్ నుంచి టీచర్ దేవ్లాను బయటకు లాక్కొచ్చి చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
- నేటి జాతకములు…25 మార్చి, 2026
- Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..
- వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
- Banjara Hills: ఇంట్లోనే వ్యభిచారం.. అలేఖ్య అరెస్ట్





