SGSTV NEWS online
Crime

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..



మెదక్ జిల్లా రేగోడ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు మహమ్మద్ తన తండ్రి శాకీర్‌ను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి బానిసైన మహమ్మద్ కుటుంబంతో తరచూ గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై గ్రామస్తుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మద్యం మత్తులో క్షణికావేశంతో కన్న తండ్రినే కడతేర్చాడు ఓ కొడుకు…మద్యానికి బానిసై తరుచూ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగేవాడు…ఈ వాగ్వాదం కాస్త ఉద్రేకంగా మారడంతో కన్న తండ్రిని కర్రతో తలపై బాది హతమార్చాడు…ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం..


రేగోడ్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అనే యువకుడు మద్యం మత్తులో అతని తండ్రి శాకీర్ నీ కొట్టి చంపేశాడు. మద్యానికి బానిసైన మహమ్మద్ తరచూ తండ్రితో చీటికిమాటికి గొడవపడేవాడు.ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మహమ్మద్ ను షాకిర్ మందలించే ప్రయత్నం చేశాడు.. దాంతో మహమ్మద్ తన తండ్రి శాకీర్ను విపరీతంగా కొట్టాడు. కొడుకు చేతిలో తీవ్ర గాయాలపాలైన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గ్రామస్తుల సమాచారంతో ఎస్ఐ పోచయ్య ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి భార్య హంజన్ భర్త మృతదేహం వద్ద విలపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Also Read

Related posts