చికెన్‌లో లివర్ వడ్డించలేదనే కారణంతో హాస్టల్ వార్డెన్‌పై విద్యార్థులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. విరాల్లోకి వెళ్తే.. ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే. అయితే హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు ఆ లోటు ఉండొద్దనే కారణంతో ప్రభుత్వ హాస్టల్స్‌లో సైతం ఆదివారం నాన్‌వెజ్‌ను అందిస్తున్నారు. దీంతో పిల్లలు ఆదివారం ఎప్పుడు వస్తుందా చికెన్ ఎప్పుడు తిందామా అని వేయిట్ చేస్తూ ఉంటారు. ఇలానే మహబూబాబాద్ జిల్లాలోని వరంగల్ ఇంగుర్తి ఎస్సీ బాలుర హాస్టల్‌లో కూడా విద్యార్థులు ఆదివారం భోజనానికి వచ్చారు. కానీ ఆరోజు చికెన్ హాస్టల్ సిబ్బంది లివర్ వడ్డించకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందారు.
ఇనుగుర్తి ఎస్సీ బాలుర హాస్టల్‌లో 60 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. రోజువారీ మెనూ ప్రకారం, ఆదివారాల్లో విద్యార్థులకు మాంసాహార భోజనం పెట్టాలి. అయితే విద్యార్థులు దీని గురించి వార్డెన్‌ను అడిగినప్పుడు, అతను రెండు కిలోల చికెన్ లివర్ కొని తీసుకురావాలని సిబ్బంది తెలిపాడు. దీంతో సిబ్బంది చికెన్ లివర్ కొని వంటవాడికి ఇచ్చారు, కానీ విద్యార్థులకు భోజనం సమయంలో ఒక్క చికెన్ లివర్ ముక్క కూడా వడ్డించలేదు.
దీంతో తీవ్ర నిరాశకు లోనైన విద్యార్థులు ఈ విషయంపై ఎంపీడీఓ బండారు పార్థసారథికి ఫిర్యాదు చేశారు. హాస్టల్ వార్డెన్, వంటచేసే వ్యక్తులు తమ వద్దకు తెచ్చిన చికెన్ లివర్ మొత్తాన్ని తినేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఏంపీడీవోను కోరారు. భోజన మెనూను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read
- శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
- నేటి జాతకములు…25 మార్చి, 2026
- Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్..
- వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
- Banjara Hills: ఇంట్లోనే వ్యభిచారం.. అలేఖ్య అరెస్ట్





