హైదరాబాద్ అమీర్‌పేటలో ఓ షాకింగ్ ఘటన బయటపడింది. ఇంట్లో రన్నింగ్‌లో ఉన్న వాషింగ్ మెషీన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. క్షణాల్లోనే యంత్రం తునాతునకలై ఇంటి అంతటా పార్ట్స్ ఎగిరిపడ్డాయి. అదృష్టవశాత్తు.. పేలుడు సమయంలో మెషీన్ దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ అమీర్‌పేటలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. సాధారణంగా నిత్యవసర పనులలో భాగమైపోయిన వాషింగ్‌మెషీన్ ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అమీర్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రన్నింగ్‌లో ఉన్న వాషింగ్‌మెషీన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. క్షణాల్లోనే యంత్రం పూర్తిగా చెదిరిపోయి, దాని పార్ట్స్ అన్నీ ఇంటి అంతటా ఎగురుతూ తునాతునకలయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన ఈ శబ్దంతో చుట్టుపక్కల అందరూ షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తు పేలుడు జరిగిన సమయంలో ఇంటి సభ్యులు ఎవరూ మెషీన్ దగ్గర లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వాషింగ్‌మెషీన్ రన్నింగ్‌లో ఉండగానే ఏవో అంతర్గత లోపాల కారణంగా పేలిపోయిందని కుటుంబ సభ్యుల అనుమానం. ఇంట్లో అకస్మాత్తుగా వస్తువులు ఎక్కడికక్కడ పడి.. పొగలు కూడా కనిపించడంతో, ఏం జరిగిందో అర్థం కాక కొంతసేపు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో గృహ వినియోగాని వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. వాడే ముందు, సర్వీస్ చేయించుకోవడం, ఓవర్‌లోడ్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read
- Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లో వారికి అనుకూలత.. 12 రాశుల వారికి వారఫలాలు
- Andhra Pradesh: ఇలా ఉన్నారేంట్రా.. గోల్డ్ షాపు ఓనర్ కళ్లలో కారం కొట్టి ఇతడు ఏం చేశాడో చూడండి..
- Ugadi 2026: పరాభవ నామ సంవత్సరం అర్థం ఏమిటి..? మనకు ఇచ్చే రహస్య సందేశం ఏంటో తెలుసా..?
- టార్గెట్ ఒకరు.. ప్రాణం పోయింది మరొకరిది.. బట్టల తీగకు కరెంట్ షాక్ పెట్టి హత్య
- దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?





