April 19, 2025
SGSTV NEWS
CrimeLatest NewsTelangana

కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి

హైదాబాద్ పరిధిలోని గాజులరామారంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి.. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది.. తర్వాత ఆమె భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన మానసిక స్థితిగురించి 4పేజీల సూసైడ్‌ నోట్‌ రాసిన తేజస్విని.. ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది. మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపి తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన మేడ్చల్‌ జిల్లా గాజులరామారంలో పరిధిలో గురువారం చోటుచేసుకుంది.. ఇద్దరు కుమారులను కత్తితో నరకిన తర్వాత.. మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కళ్ల ముందు ఆడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడం.. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తేజస్విని మానసిక స్థితి సరిగా లేకపోవడం.. పిల్లలిద్దరికి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడం, చిన్నచిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ లేఅవుట్ సహస్ర హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వారికి అర్షిత్‌ రెడ్డి (6), ఆశిష్‌ రెడ్డి (8) అనే ఇద్దరు కుమారులున్నారు. మానసిక స్థితి బాలేకపోవడంతో.. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని తన ఇద్దరు కుమారులను కొబ్బరి బొండాలు కొట్టే కొడవలితో మెడపై నరికింది.. ఈ ఘటనలో ఆశిష్‌ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, అర్షిత్‌ రెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు .. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలను సేకరించారు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు 5 పేజీల సూసైడ్‌ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అనారోగ్య కారణాల వలన ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తేజస్విని రాసిందని చెబుతున్నారు. అలాగే.. తేజస్విని రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని.. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via