SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: కసాయిగా మారిన కన్నతల్లి.. ఏడుస్తుందని పాసిపాప నోట్లో గుడ్డలు కుక్కి..



కాలిపోయిన ఆ బిడ్డ దేహాన్ని మీకు పూర్తిగా చూపించే సాహసం మేం చేయలేం. మీరూ చూడలేరు. విచిత్రం ఏంటంటే చంపేసిన ఆ తల్లి పేరు మమత. ఆపేరు పెట్టుకున్నందుకు… బిడ్డకు కనీసం మమతను కూడా పంచలేకపోయింది. ఇంత రాక్షసత్వానికి ఒడిగట్టిన ఆ తల్లిని సైకో అనాలా.. పిచ్చిదనాలా.. అసలు ఏం అనాలి. కంటిపాపలా చూసుకోవాల్సిన బిడ్డను ఇంత కిరాతకంగా చంపేస్తారా? ఎంత ఏడిస్తే మాత్రం నిప్పుల్లో పడేసి సజీవదహనం చేస్తారా? నోరు లేని బిడ్డ..నొప్పి అని చెప్పుకోలేని రోజుల బిడ్డ. ఏడుస్తూ కూడా అమ్మా అనే గుక్కపెట్టి ఉంటుందేమో. ఏడుపుకి కారణం ఏంటో తెలుసుకోలేని ఆ మూర్ఖపు తల్లి.. బిడ్డను ఏ ఇతర కుటుంబసభ్యులతో అప్పగించొచ్చు కదా. లేదా ఏ డాక్టర్ దగ్గరికో తీసుకెళ్లి చూపించొచ్చు కదా. మరీ ఇంత దారుణంగా కట్టెల పొయ్యిలో పడేసి సజీవ దహనం చేస్తుందా.. వింటుంటేనే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది..మాతృ హృదయం మానవత్వం.. ఏమైపోయింది. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చంపడానికి ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయి.. తలచుకుంటేనే కంటనీరు వస్తోంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది.


హైదరాబాద్ నగరంలోని బౌరంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. రెండు నెలల బిడ్డ పాలిట ఓ తల్లి మరణశాసనం రాసింది.. బిడ్డ కళ్లకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి కట్టెల పొయ్యిలో పడేసింది.. అత్యంత దారుణ స్థితిలో పసిబాలుడి మృతదేహం కనిపించింది. బిడ్డ అదేపనిగా ఏడుస్తున్నాడన్న కోపంతో తల్లి చంపేయడం కలకలం రేపింది. ఈ ఘటన గురించి పోలీసులు పలు సంచలన విషయాలను పంచుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో డయల్‌ 100కి సమాచారం రావడంతో స్పాట్‌కి వెళ్లామన్నారు పోలీసులు. బౌరంపేట్ ORR సమీపంలో సానరెళ్లి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.

సంఘటనా స్ధలాన్ని పరిశీలించిన పోలీసులు హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలోపడ్డారు. ప్రాధమిక దర్యాప్తులో మధ్యప్రదేశ్ నౌగ్రామ్‌ గ్రామానికి చెందిన మమత, రాజేందర్ వలసవచ్చి…స్ధానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో వాచమెన్‌గా పనిచేస్తున్నారన్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also read

Related posts