మారుతున్న కాలంతోపాటు మనుషులు కూడా ఛేంజ్ అవుతున్నారు. డబ్బుకు ఇస్తున్న విలువ మానవ సంబంధాలకు ఇవ్వట్లేదు. డబ్బుపై ఉన్న మోజుతో ప్రాణంగా ప్రేమించిన వారినే చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ప్రేమించిన పెళ్లి చేసుకున్న భర్త అదనపుకట్నం కోసం వేధించడంతో పెళ్లిన 50 రోజులకే యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థలానికి తీవ్ర కలకలం రేపింది.
ప్రేమించిన పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక పెళ్లైన 50 రోజులకే యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. అమెకు ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నీరజ్ కూడా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఫేస్‌బుక్‌లో స్నేహింగా మొదలైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ తమ ఇళ్లలో విషయాన్ని చెప్పి పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 10న పట్నాలో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత ఇషికకు కూడా హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ కావడంతో ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. అయితే సరిగ్గా పెళ్లినైన 50 రోజుల తర్వాత బుధవారం ఇషిక ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిండి. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన భర్త ఇషికను చూసి హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. విషయాన్ని ఇషిక కుటుంబ సభ్యులుకు తెలిపారు. అయితే భర్త అదనపు కట్నం కోసం వేధించడంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- April 2026: ఏప్రిల్ నెలలో వచ్చే పండుగలు, శుభతిథులు, ప్రత్యేక దినోత్సవాలు
- నాడి గణపతి మహాత్యం- అవహేళన చేసిన బ్రిటిష్ గవర్నర్‌కు బుద్ధి చెప్పిన వైనం- ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?
- నేటి జాతకములు..3 ఏప్రిల్, 2026
- స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవులుగా తల్లీ, ఇద్దరు కూతుళ్లు.. బుధవారం రాత్రి ఏం జరిగింది..?
- Hyderabad: ప్రేమించారు, పెద్దలనొప్పించి పెళ్లి చేసుకన్నారు.. కట్‌చేస్తే 50 రోజులకే ఆ ఇంట్లో..





