హైదరాబాద్‌లో మరో హృదయ విదారక ఘటన జరిగింది. ప్రేమ విఫలమై నిరాశలో మునిగిపోయిన బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా పొత్తూరు ప్రాంతానికి చెందిన ఈ యువకుడు సిటీకి వచ్చి చదవుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్య ముభావంగా ఉంటూ వచ్చాడు….
పిల్లలను మంచి భవిష్యత్ కోసం ఉన్నత చదువులు చదివించాలనుకుంటారు తల్లిదండ్రులు. కానీ కాలేజీకి వెళ్లిన కొంతమంది యువకులు, యువతులు ప్రేమ పేరుతో జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్న తరచూ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి హృదయ విదారక ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రేమలో విఫలమైన 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులను అంతులేని విషాదంలోకి నెట్టాడు. గుంటూరు జిల్లా పొత్తూరు ప్రాంతానికి చెందిన దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కి వచ్చి సురారం ప్రాంతంలో స్థిరపడ్డారు. వారి కొడుకు స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో బాగానే ఉన్న ఈ యువకుడి జీవితంలోకి ప్రేమ ప్రవేశించి.. ఆ తర్వాత బలి తీసుకుంది.
ఆ విద్యార్థి ప్రేమించిన అమ్మాయి ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఆమెకు అతడి లవ్ గురించి ముందుగా చెప్పాడా? లేక అతని మనసులో మాత్రమే సీక్రెట్‌గా ఉన్న వన్‌సైడ్ ప్రేమేనా? అనే దానిపై స్పష్టత లేదు. కానీ ఆమె వివాహం వార్త అతడి మనసును పూర్తిగా కకావికలం అయింది. ఆ రోజు నుంచి అతడు లోపల మదనపడిపోయాడు. తల్లిదండ్రులు ఏం అడిగినా మాటకు మాట చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. వారు మాత్రం పరీక్షలు, చదువు ఒత్తిడి కారణంగా అలా ఉన్నాడనుకున్నారు. కానీ అతడి మనసులో జరిగిన పోరు వారికి అర్థం కాలేదు. కానీ ఒకరిద్దరు మిత్రులతో మాత్రం.. తన బాధను వ్యక్తపరిచాడు. ఆ పెయిన్‌ను ఎక్కువకాలం భరించలేక.. ఊపిరి తీసుకున్నాడు.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో, ఆశలతో నగరానికి తీసుకొచ్చిన కొడుకు ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో విషాదంలో మునిగిపోయారు. “ఏ తల్లిదండ్రుల తమ కళ్ల ముందు వారి పిల్లలు ఇలా మాయమవ్వకూడదు” అని కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





