హైదరాబాద్ లోని ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయ్‌పై పీడి యాక్ట్ కేసుపై మంగళవారం (అక్టోబర్ 28) హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌పై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ లు వాదనలు వినిపించారు. చివరగా అంగూర్ భాయ్ వేసిన వేసిన పీడీ యాక్ట్ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు తీర్పు విలువరించారు.
గంజాయి వ్యాపారాలతో లేడీ డాన్‌గా చెలామణి అవుతున్న అరుణ బాయ్ అలియాస్ అంగూర్ భాయ్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పెట్టిన పీడీ యాక్ట్‌ను సవాలు చేస్తూ.. అంగూర్ భాయ్ హైకోర్టుకు వెళ్ళింది. పీడీ యాక్ట్ పై హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంజ్ న్యాయమూర్తులు మౌసమి భట్టాచార్య, గాడి ప్రవీణ్ కుమార్ వాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు.
హైదరాబాద్ లోని ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయ్‌పై పీడి యాక్ట్ కేసుపై మంగళవారం (అక్టోబర్ 28) హైకోర్టు బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌పై ప్రభుత్వ స్పెషల్ ప్లీడర్ స్వరూప్ ఒరిలా, అసిస్టెంట్ లీడర్ రవి కుమార్ లు వాదనలు వినిపించారు. చివరగా అంగూర్ భాయ్ వేసిన వేసిన పీడీ యాక్ట్ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు తీర్పు విలువరించారు. గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై ఎక్సైజ్ శాఖ ఎస్టీఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి, దూళిపేట ఎక్సైజ్ సీఐ మధుబాబు సిబ్బంది కలిసి అంగూర్ భాయ్ పై అనేక కేసులు ఉండడంతో ఆమెపై పిడి యాక్ట్ పెట్టాలని ప్రతిపాదించారు.
అంగూర్ భాయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నియమించిన అడ్వైసరీ బోర్డు 2025 మార్చి 10న ప్రతిపాదనలకు పంపించారు. బోర్డు సిఫారసు మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 2025 ఏప్రిల్ 15న అంగూర్ భాయ్‌పై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
పీడీ యాక్ట్ ఉత్తరువులను సవాల్ చేస్తూ అంగూర్ భాయ్ హైకోర్టులో పీడీ యాక్ట్‌పై పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ వాదప్రతిపాదనలు విన్న అనంతరం అంగూర్ భాయ్ వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తులు తీర్పు వెల్లడించారు. అంగూరు భాయ్ పై పీడీ యాక్ట్ పిటీషన్ ను హైకోర్టులో కొట్టివేయడంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ డైరెక్టర్ షాన్వాస్ ఖాసిం ఎక్సైజ్ సిబ్బందిని అభినందించారు.
Also read
- వామ్మో జర్రుంటే నిండు ప్రాణం బలయ్యేది.. ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయొద్దు.. వీడియో
- Hyderabad: భర్త ఆటోడ్రైవర్.. మరో వ్యక్తితో భార్య ఆ యవ్వారం.. అర్థరాత్రి గుట్టుగా ఏం చేసిందంటే..
- ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు..! అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా మరో ప్రమాదం..
- హెడ్మాస్టర్ అండతో మరింత రెచ్చిపోయాడు.. అమ్మాయిల పట్ల అటెండర్ అసభ్య ప్రవర్తన.. చివరకు..
- గంజాయి మత్తులో బాటసారులను పరుగులు పెట్టించిన ఆకతాయికి దేహశుద్ధి!





