తండ్రి వివాహ సంబంధాలు చూడటం లేదని కర్రతో బాధి హత్య చేశాడు కొడుకు. గత కొన్ని రోజులుగా పెళ్లి విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు చూడటం లేదని తండ్రిని అత్యంత దారుణంగా చంపాడు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో ఈ హత్య జరిగింది. తండ్రి గంగ నర్సయ్యకు కొడుకు అన్వేష్ ఉన్నాడు. అయితే పెళ్లి సంబంధాలు చూడటం లేదని గొడవలు జరుగుతున్నాయి. ప్రతి రోజు ఇదే విషయంలో తండ్రి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో సోమవారం ఉదయం తండ్రి నర్సయ్య ధ్యానం చేస్తున్నారు. అదే సమయంలో కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు. తండ్రి, కొడుకుల మధ్య మాట మాట పెరిగి పక్కనే ఉన్న కర్రతో కొడుకు అన్వేష్ తండ్రి తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయిన నరేష్‌కు ఫోన్ చేసి గొడవ విషయం చెప్పడంతో భార్య హారికతో కలిసి ఘటనాస్థలానికి చేరుకకున్నారు. రక్తపు మడుగులో ఉన్న తండ్రిని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ నర్సయ్య మరణించినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. మృతుని కూతురు హరిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





