SGSTV NEWS online
CrimeTelangana

ఓరీ దేవుడో.. ఇదెక్కడి దారుణం.. చికెన్ ముక్క ఇరుక్కొని ఆటో డ్రైవర్ మృతి




ఖర్జూరం విత్తనం గొంతులో ఇరుక్కుని 42ఏళ్ల వ్యక్తి మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. ఇలాంటిదే మరో వార్త వెలుగులోకి వచ్చింది. చికెన్‌ ముక్క గొంతుల్లో ఇరుక్కొని ఆటో డ్రైవర్‌ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపలిల్లో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్‌ డబుల్‌బెడ్రూం కాలనీకి చెందిన పాటి సురేందర్‌(45) ట్రాలీ ఆటో న డుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లో చికెన్‌ వండుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంటిల్లిపాది కలిసి కూర్చుని తింటూ ఉండగా, సురేందర్‌ కు చికెన్ ముక్క గొంతులో ఇరుకుపోయింది. దీంతో అతడు శ్వాస ఆడక చాలా సేపు ఇబ్బందిపడ్డాడు. ఊపిరాడక మృతి చెందాడు. సురేందర్‌ మృతితో అతని, బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Also Read

Related posts