SGSTV NEWS online
CrimeTelangana

స్కూల్‌కు సక్రమంగా వెళ్లమన్న తండ్రి.. 12ఏళ్ల కొడుకు ఆత్మహత్య!




హైదరాబాద్ మహానగరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో వీడియోలు చూడవద్దని, గేమ్స్ ఆడవద్దని తండ్రి హితవు పలికాడు. అంతే ఆ మాటలనే భరించలేని 12 సంవత్సరాల విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషాద ఘటన బంజారాహిల్స్ పరిధిలో జరిగింది.


బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఫస్ట్ లాన్సర్ సయ్యద్ నగర్‌లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో ఐదవ త రగతి చదువుతున్నాడు. తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు. మొండివాడిగా ముద్రపడ్డ అఫాన్ ఖాన్ తండ్రి చెప్పినా వినకుండా ఫోన్‌లో వీడియోగేమ్ చూస్తూ స్కూల్‌కు డుమ్మా కొడుతున్నాడు.

ఇప్పటికే మూడు స్కూల్స్ మారాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ చూస్తుండడంతో తండ్రి మందలించాడు. ఫిబ్రవరి 24, మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అఫాన్ తన గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts