October 16, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: మరో మారు తెరపైకి వచ్చిన శాంతి.. అతడిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు..

Crime News: మాజీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మరో మారు వార్తల్లో నిలిచారు. గతంలో శాంతి భర్త మదన్ మోహన్ ఆమెపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ విషయంపై మదన్ పలు ఆరోపణలతో మీడియాకెక్కారు. అంతేగాక ఢిల్లీకి వెళ్లి తనకు న్యాయం చేయాలని కోరారు. ఇలా మదన్ మోహన్, శాంతి పేర్లు నాడు వార్తల్లో మారుమ్రోగింది.

ఆ సమయంలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ పట్ల శాంతి మీడియా ముఖంగా మానసిక ఆవేదన చెందారు. అంతేగాక తన తప్పు లేని అంశాన్ని పదే పదే మీడియాలలో చూపించడం తగదని, తాను చట్టప్రకారం తన భర్తపై పోరాడనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం మరో మారు తెరమీదికి వచ్చి యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై వేధింపులకు పాల్పడుతున్నారంటూ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో హైకోర్టు అడ్వకేట్ అంకాల పృధ్వీరాజ్ తో కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. కాగా గతంలో త‌న‌ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రసారాలు చేయకూడదని హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ ను తీసుకువచ్చారు శాంతి.


యూట్యూబర్ దాసరి విజ్ఞాన్, రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ తనపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్నారంటూ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి

కానీ యూట్యూబ్‌లో దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి త‌న‌పై 5 నుంచి 10 వీడియోలు పోస్టు చేశాడ‌ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ వీడియోలతో తాను మానసిక క్షోభకు గురైనట్లు.. తన వ్యక్తిత్వ హనానాన్ని చేయడం జరిగిందని ఫిర్యాదు ఇచ్చారు. అలాగే మాజీ జడ్జి రామకృష్ణ కూడా తనపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారని ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణలో కూడా దాసరి విజ్ఞాన్‌పై ఏడు కేసులు ఉన్నాయని, మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియాలో వారిపై అసభ్యకరంగా మాట్లాతున్నట్లు అడ్వకేట్ అంకాల పృధ్వీరాజ్ తెలిపారు.

ఇలా శాంతికి సంబంధించిన వీడియోలనే కాక, హర్షసాయి కేసు బాధితురాలికి సంబంధించిన వీడియోలను కూడా దాసరి విజ్ఞాన్‌ యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. ఇప్పటికే భాదితురాలు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌న‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో దాసరి విజ్ఞాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో మాజీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కూడా విజ్ఞాన్ పై ఫిర్యాదు చేశారు. మహిళలను వేధించడం, ట్రోలింగ్ చేయడం వంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని శాంతి కోరుతున్నారు.

Also read

Related posts

Share via