SGSTV NEWS
Andhra PradeshCrime

Crime News: విద్యార్థినులపై లైంగిక వేధింపులు



డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు పిండి శ్రీనివాస్ మూడు నెలలుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం బయటపడడంతో తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు.


పి.గన్నవరం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు పిండి శ్రీనివాస్ మూడు నెలలుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం బయటపడడంతో తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఈఓ-1 కోన హెలీనా మంగళవారం పాఠశాలకు విచారణకు వెళ్లగా విద్యార్థినులు చిగురుటాకుల్లా వణికిపోతూ వేధింపుల గురించి చెప్పలేక కన్నీరుమున్నీరయ్యారు. గుడ్తచ్-బ్యాడ్రచ్ గురించి ఓ టీచర్ చెప్పడంతో విద్యార్థినులకు అవగాహన వచ్చింది. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తమ పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు బయటపెట్టారు.

సోమవారం సాయంత్రం ఒక విద్యార్థినిని కౌగిలించుకున్నాడని ఓ ఆయా మంగళవారం విచారణలో వెల్లడించారు. తమ పిల్లల పట్ల ఉపాధ్యాయుడి ప్రవర్త తీరుపై తల్లిదండ్రులు, స్థానికులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, డీఈఓ సలీంబాషా దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓలు హెలీనా, చింతా వీరభద్రానందం నాగుల్లంక పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. అనంతరం ఎస్సై చిరంజీవి, సిబ్బంది నాగుల్లంక వచ్చి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.

మూడేళ్ల క్రితం ఉద్యోగం..

1998లో క్వాలిఫై అయిన శ్రీనివాస్కు మూడేళ్ల క్రితం మినిమం టైంస్కేల్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. గత ఏడాది జూన్ 26న నాగుల్లంక ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఇక్కడ 4, 5 తరగతుల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం బయటపడింది.

Also read

Related posts

Share this