April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime News: మనిషివా.. మాస్టారువా – 5వ తరగతి విద్యార్థినిపై.. ఛీ ఛీ!


మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రేగుచెట్టు రమేష్‌.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు

రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులు అని చూడకుండా అత్యంత క్రూరంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి కీచక చర్యలకు పాల్పడుతుండటం అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లి, తండ్రి తర్వాత గురువే ప్రత్యక్ష దైవంలా భావించే చిన్నారులపై కొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మీరే మా స్ఫూర్తి అని స్టూడెంట్స్ చేత చెప్పించుకోవలసింది పోయి.. వారిచేతే తిట్లు తింటున్నారు, వారిచేతే దెబ్బలు కాస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది.

లైంగిక వేధింపులు
తండ్రి వయసున్న ఓ ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడితో ఆగకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వద్దు వద్దు అన్నా తాకరాని చోట తాకాడు. ఇక జరిగిన విషయాన్ని ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతడి రంగు బయటపడింది. దీంతో ఆ బాలిక తల్లి దండ్రులు పాఠశాలకు వచ్చి అతడిపై దాడికి యత్నించారు.

బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగి విధులు నిర్వర్తిస్తున్న రేగుచెట్టు రమేష్‌.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

తాకరాని చోట తాకుతూ
తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సాయంత్రం ఇంటికెళ్లిన ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు తమ బంధువులతో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. ఆపై ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు

Also read

Related posts

Share via