SGSTV NEWS
CrimeNational

ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!



హర్యానాలో ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి రోహ్‌తక్‌లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సందీప్ లాథర్ గా గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలోని ఒక గదిలో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు


హర్యానాలో ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ సూసైడ్ కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి రోహ్‌తక్‌లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సందీప్ లాథర్ గా గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలోని ఒక గదిలో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సమీపంలో ఒక సూసైడ్ నోట్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. అతను ప్రస్తుతం సైబర్ సెల్‌లో విధుల్లో ఉన్నాడు.


లాధౌత్ గ్రామంలోని పొలాల్లో అతని మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వై. పురాణ్ కుమార్ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అక్టోబర్ 11న రోహ్‌తక్‌ను సందర్శించింది. ఈ కేసులో మృతుడి సంబంధాల గురించి సమాచారం సేకరిస్తున్నారు.

సందీప్ లాథర్ ఐపీఎస్ వై. పురాణ్ తో పోస్టింగ్ పొందిన సుశీల్ కుమార్ ను అరెస్టు చేసి, తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నాడు. ఇంతలో, రోహ్తక్ అవినీతి కేసులో పురాణ్ కుమార్ ను ఇరికించడానికి కుట్ర జరిగిందని ఐపీఎస్ అధికారి ఐఏఎస్ భార్య ఆరోపించింది. ఆ కుట్రలో భాగంగా, మద్యం వ్యాపారి నుండి నెలవారీ లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై సుశీల్ కుమార్ ను అరెస్టు చేశారు.


ఆత్మహత్య చేసుకునే ముందు, సందీప్ లాథర్ పురాన్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దర్యాప్తులో ఇవి వెల్లడయ్యాయి. సందీప్ కుమార్ లాథర్ సూసైడ్ నోట్, 6 నిమిషాల చివరి వీడియో కూడా బయటపడింది. దీని ద్వారా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సందీప్ సూసైడ్ ఘటన హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Also read

Related posts