SGSTV NEWS online
CrimeNational

Delhi Blast: ఉగ్ర కుట్ర..? కొత్త తరహాలో భారీ పేలుడు.. తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు

ఢిల్లీ పేలుడు వెనుక మాస్టర్‌ మైండ్‌ ఎవరు ? ఉగ్ర కుట్ర జరిగిందా ? మరో పన్నాగం దాగుందా ? ఇంతకీ టార్గెట్‌ ఎవరన్నది మిస్టరీగా మారింది. ఈసారి పేలుడు గతానికి భిన్నంగా, కొత్త తరహాలో జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు గుట్టు విప్పే పనిలో నిమగ్నమైంది NIA.. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఢిల్లీ పేలుడు మిస్టరీగా మారింది. తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఘటనా స్థలంలో FSL టీమ్ తనిఖీలు చేపట్టింది. ఆధారాలు సేకరిస్తోంది ఫోరెన్సిక్ టీమ్. తనిఖీల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెనుక భాగంలో పేలుడు జరిగినట్టు గుర్తించారు. ఇదివరకెప్పుడూ చూడని కొత్త తరహాలో పేలుడు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు తర్వాత రోడ్డుపై గుంతలు పడలేదని అధికారులు చెబుతున్నారు. మృతుల శరీరాల్లో పదునైన అవశేషాలు ఎక్కడా కనిపించలేవంటున్నారు. పేలుడు ఉగ్ర కుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి పేలుడుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల విధ్వంసం కాకుండా ప్రాణ నష్టం భారీగా ఉండేలా ప్లాన్‌ చేసినట్టు స్పష్టమవుతోంది.

రెడ్‌పోర్ట్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్‌-1 దగ్గర పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన పది నిమిషాల్లోనే మంటలు దావానంలా వ్యాపించాయి. పేలుడు ధాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు. కానీ మంటలు ఆర్పేదాకా తెలియలేదు, ఇది భారీ విధ్వంసమని. ఒకటి, రెండు, మూడు, నాలుగు.. అంటుండగానే ఇలా మరణాల సంఖ్య 8కి చేరింది. 20 మందికిపైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి పకడ్బందీ ప్లాన్‌తోనే పేలుడుకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రాణ నష్టం అధికంగా ఉండేలా పక్కా ప్రణాళికతో పేలుడుకు కుట్ర చేసినట్టు తేటతెల్లమవుతోంది.

13 ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. బ్లాస్ట్ అయిన ప్లేస్‌ చూస్తే గుండెలు జలదరిస్తాయి. అంత భయానకంగా ఉందా స్పాట్. ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే, ఏదో కుట్ర జరిగే ఉంటుందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర ఓవైపు రెడ్‌ సిగ్నల్ పడడంతో వెహికిల్స్ ఆగాయి. ఆగిన వెహికిల్స్‌లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియా కావడం, పెద్దగా జనసంచారం లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. లేకుంటే చరిత్రలో ఊహించని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదంటున్నారు అధికారులు..

Also read

Related posts