SGSTV NEWS online
CrimeNational

ఆమెకు 34.. అతనికి జస్ట్ 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టి గట్టిగా అరుపులు.. కాసేపటికే..



కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఒంటరిగా ఉన్న టెక్కీ రూమ్‌లోకి దూరిన ఒక యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయేయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తనకు అప్పటికే పరిచయమున్న 34 ఏళ్ల టెక్కీ రూమ్‌లోకి అర్ధరాత్రి చొరబడిన 18 ఏళ్ల యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో.. హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళూరుకు చెందిన షర్మిల (35) గత రెండేళ్లుగా రామమూర్తి నగర్‌లోని సుబ్రమణ్య లేఅవుట్‌లో అద్దెకు తీసుకున్న ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంది. నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆమె తన స్నేహితురాలు షబరీన్‌తో కలిసి డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఉంటుంది. అయితే, షబరీన్ గత 15 రోజులుగా పని కోసం ఢిల్లీకి వెళ్లడంతో షర్మిల ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది. అయితే ఆమె పక్కింట్లో ఉంటున్న కల్నల్ కురై(18) అనే యువకుడు కొన్నాళ్లుగా షర్మిలను వన్‌సైడ్‌గా లవ్ చేస్తున్నాడు.

అయితే వారిద్దరికి ముందే పరిచయమున్నప్పటికీ కల్నల్‌ ఈ విషయాన్ని షర్మిలకు చెప్పలేదు. అయితే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టు తెలుసుకున్న కల్నల్ ఇటీవల తన బాల్కనీ గుండా ఆమె ఫ్లాట్‌లోకి ప్రవేశించి షర్మిలతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అతికిరాతకంగా హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు రూమ్‌ను తగలబెట్టాడు. రూమ్‌లోంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే షర్మిలకు కాల్ చేశారు. ఆమె పికప్ చేయకపోవడంతో షబరీన్‌కు సమాచారం అందించారు. ఢిల్లీలో ఉన్న షబరీన్ బెంగళూరులోని తన స్నేహితులకు చెప్పడంతో వారు వెంటనే షర్మిల ఫ్లాట్‌కు చేరుకున్నారు.

ప్లాట్ కాలిపోవడం చూసి వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పి లోపలికి వెళ్లగా అక్కడ షర్మిల చనిపోయిన స్థతిలో కనిపించింది. అయితే ఆమె శరీరంపై లేదా దుస్తులపై ఎటువంటి కాలిన గాయాలు లేకపోవడం, ఫ్లాట్‌లో మద్యం బాటిల్‌ కనిపించడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కల్నల్‌ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts