SGSTV NEWS
CrimeNational

Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్‌‌లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..



థాయిలాండ్ నుండి ప్రయాణించిన ఈ ముగ్గురు.. కొలంబో ద్వారా బెంగళూరు చేరుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారనే దానిపై చర్యలు చేపట్టారు. విచారణలో బయటకొచ్చిన వివరాల ప్రకారం.. ఈ సరుకును తమిళనాడుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎన్సీబీ అధికారులు తెలిపారు.


బెంగళూరు కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందం భారీగా మాదకద్రవ్యాలను సీజ్‌ చేసింది. అధికారుల ప్రకారం.. ఎన్‌సీబీ బెంగళూరు జోనల్ యూనిట్ పర్యవేక్షణలో చేపట్టిన చర్యలో మొత్తం 45.4 కిలోల హైడ్రో గంజా, 6 కిలోల సైలోసైబిన్ మష్రూమ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ను మొత్తం 250 ఫుడ్ టిన్‌లలో దాచి వాక్యూమ్ సీలింగ్ చేశారు. వాటి మార్కెట్ విలువ కోట్లల్లో ఉండవచ్చని బెంగళూరు ఎన్‌సీబీ అంచనా వేస్తోంది. ఈ కేసులో ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇద్దరు భారతీయులు, ఒక శ్రీలంకకు చెందిన వ్యక్తి ఉన్నాడని తెలిపారు. థాయిలాండ్ నుండి ప్రయాణించిన ఈ ముగ్గురు.. కొలంబో ద్వారా బెంగళూరు చేరుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరున్నారనే దానిపై చర్యలు చేపట్టారు. విచారణలో బయటకొచ్చిన వివరాల ప్రకారం.. ఈ సరుకును తమిళనాడుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎన్సీబీ అధికారులు తెలిపారు.

కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు బెంగళూరు జోన్ యూనిట్ పూర్తి స్థాయిలో 220 కిలోల హైడ్రో గంజాను స్వాధీనం చేసుకుందని.. మొత్తం 18 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 45 మందిని అరెస్ట్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు. వీరిలో కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, శ్రీలంక పౌరులు కూడా ఉన్నారు. గంజా, డ్రగ్స్‌ని తరలించేందుకు నూతన పద్ధతులను అవలంభిస్తున్నారు అక్రమార్కులు. గత పరీక్షల్లో డ్రగ్స్‌ను నట్ ప్యాకెట్ల మధ్యలో దాచడం, బాహ్య పొరగా చాక్లెట్ కోటింగ్ చేయడం వంటి పద్ధతులు అనుసరించేవారు. ఇప్పుడు ఫుడ్ టిన్‌లను వాక్యూమ్ సీలింగ్ చేసి మాస్కింగ్ చేయడం గమనార్హం. నిందితులకు విదేశీ సంబంధాలపై దర్యాప్తు చేపడతామని ఎన్‌సీబీ తెలిపింది.


అలాగే బెంగళూరు ఎయిర్‌పోర్టు అథారిటీస్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఇతర విచారణ ఏజన్సీలతో సహకారంతో ఈ కేసులను చేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు, సిబ్బంది ఇంకా మేనేజ్‌మెంట్ స్థాయిలో తీసుకున్న జాగ్రత్త చర్యలూ, భవిష్యత్తులో అలాంటి మాదకద్రవ్య ప్రవాహాలను నిరోధించడానికి బలమైన ఇంటర్‌ సర్వీస్ కోఆర్డినేషన్ అవసరం ఉందని అంటున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్‌కు మార్కెట్‌లో విలువ, నెట్‌వర్క్‌కి సంబంధించిన అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాలపై దర్యాప్తు పూర్తి చేసిన తరువాతే వెలుగులోకి వస్తాయని ఎన్‌సీబీ స్పష్టం చేసింది

Also read

Related posts