వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పచ్చని సంసారాలు ఇలాంటి ఎఫైర్ల వల్ల నాశనం అవుతున్నాయి. పిల్లలు అనాథలవుతున్నారు. తాజాగా ఘజాయిబాద్‌లో ఓ మహిళ ప్రియుడు ఆమె కూతురిని చంపేశాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ ఇద్దరితో వివాహేతర సంబంధాలు నిడిపింది. తనతో కాదని వేరే వారితో సన్నిహితంగా ఉంటుందనే అసూయతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
క్యాన్సర్ రోగి అయిన తన తల్లి చంపాదేవిని చూసేందుకు జ్యోతి(18) అనే యువతి తన భర్తతో కలిసి ఉత్తర్ ప్రదేశ్ బబ్రాలా పట్టణంలోని తన అత్తమామ ఇంటి నుంచి ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతానికి వెళ్లింది. జ్యోతి భర్త లలితేష్‌తో పాటు వాహనం డ్రైవర్ చంపాదేవి ఇంటికి వచ్చారు. అయితే, మంగళవారం బాబీ అనే వ్యక్తి చంపాదేవిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురు జ్యోతిపై కూడా దాడి చేశారు. ఈ ఘర్షణలో జ్యో్తి మరణించగా, ఆమె భర్త లలితేష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబీ గౌతమ్ బుద్ధ నగర్ జైలు నుంచి 15 రోజుల క్రితమే విడుదలయ్యాడు. అతను చంపాదేవితో ప్రేమలో ఉన్నాడు. అయితే, అతను జైలులో ఉన్న సమయంలో చంపాదేశీ అజయ్ అనే మరో వ్యక్తితో చనువుగా ఉంది. చంపాదేవీకి అప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త చనిపోగా, రెండో భర్త వికలాంగుడు, ఇతను బీహార్‌లో నివసిస్తున్నాడు. చంపాదేవీ మరోవ్యక్తితో సంబంధంలో ఉండటంతో కోపం పెంచుకున్న బాబీ, అజయ్‌కి ఫోన్ చేసి బెదిరించాడు. పరామర్శించే పేరుతో చంపాదేవీ ఇంటికి వచ్చి దాడికి తెగబడ్డాడు. బాబీ కత్తితో దాడి చేయగా.. జ్యోతి, లలితేష్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చంపాదేవీ కూతురు జ్యోతి తీవ్రగాయాల పాలై చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాబీని అదుపులోకి తీసుకున్నారు. బాబీకి తోడుగా వచ్చిన వ్యక్తి కోసం విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే