SGSTV NEWS online
CrimeTelangana

Crime news: ఘట్కేసర్లో రణరంగం.. పోలీసుల సమక్షంలోనే ఇనుపరాడ్లతో దాడులు



ఘట్ కేసర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ రెవెన్యూ పరిధిలో ఏకశిలా వెంచర్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాల పరస్పర దాడులతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

గత కొన్నాళ్లుగా ఏకశిలా ప్లాట్ల యజమానులు, ఏకశిల భూములను కొనుగోలు చేసిన స్థిరాస్తి వ్యాపారి వెంకటేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్లాట్ యజమానులను అక్కడికి వెళ్లనీయకుండా.. ఏకశిలా వెంచర్ చుట్టూ వెంకటేష్ అనుచరుల పహారా ఉండేది.

ప్లాట్ల యాజమానులను భయభ్రాంతులకు గురిచేసి, దౌర్జన్యానికి దిగడంతో వెంకటేష్ అనుచరులపై పోచారం పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. కొంతకాలం పోచారం పోలీసులు ఏకశిలా వెంచర్

పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏకశిలా వెంచర్లో సర్వే కోసం వచ్చిన అధికారులను ప్లాట్ల యజమానులు అడ్డుకుని, ఆందోళనకు దిగారు. శనివారం ఏకశిలా ప్లాట్ల యజమానులు కొందరు అక్కడికి వెళ్లగా.. స్థిరాస్తి వ్యాపారి వెంకటేశ్ అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు చేసేందుకు వచ్చిన పోచారం పోలీసుల ఎదుటే ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు పోచారం, మేడిపల్లి పీఎస్లలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.


Also Read

Related posts