సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్తాకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
చిలమత్తూరు: సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్మెన్, తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన తండ్రీ, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: మంత్రి సవిత
ఈ ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన కుటుంబ సభ్యులను బంధించి అత్తాకోడలిపై అఘాయిత్యానికి పాల్పడి క్షమించరాని నేరం చేశారని తెలిపారు. పండగ వేళ ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సవిత హామీ ఇచ్చారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025