SGSTV NEWS online
Andhra PradeshCrime

Crime news: అల్లూరి జిల్లాలో దారుణం.. అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడి సజీవదహనం



పాడేరు: అల్లూరి జిల్లాలో దారుణం జరిగింది. అప్పిచ్చిన పాపానికి సజీవ దహనానికి గురయ్యాడు ఓ గిరిజన వృద్ధుడు. అత్యంత మారుమూల శివారు కొండ గ్రామంలో జరగడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం అయినాడ పంచాయతీ చింతలపాలెంలో కొర్ర రామన్న (62), వంతల సోమన్న మిత్రులుగా ఉండేవారు. అవసరాల నిమిత్తం సోమన్నకు.. రామన్న రూ.5600 అప్పు ఇచ్చాడు. రామన్న తరచూ అడుగుతూ, అందరితో చెబుతుండడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. అతని ఇంటికి వెళ్లి కర్రతో దాడి చేశాడు. డబ్బులు అడుగుతావా అని ఇంటికి నిప్పంటించాడు. హాహాకారాల మధ్య వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. అప్పిచ్చిన పాపానికి హత్యకు గురయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐ దీనబంధు తన సిబ్బందితో గ్రామాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts