ఏపీలోని అనంతపురంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గుత్తి మండలం తొండపాడులో ఓ మహిళ భర్త గ్యాస్ సిలిండర్ తెచ్చి ఇవ్వడం లేదని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. ఫినాయిల్ తగ్గి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. కానీ వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.
ఎవరైనా ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తారు… గ్యాస్ బుక్ చేసుకుంటారు లేదా గ్యాస్ గోడౌన్ దగ్గరికెళ్ళి గ్యాస్ తెచ్చుకుంటారు. కానీ భర్త గ్యాస్ సిలిండర్ తీసుకొని రాలేదని ఓ భార్య కోపంతో ఏకంగా ఫినాయిల్ తాగింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తొండపాడుకు చెందిన భర్త హరికృష్ణ గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లాడు. అయితే గ్యాస్ కొరత వల్ల ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు. డెలివరీ చేయడానికి చాలా టైమ్ పడుతుందంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా మూడు రోజులుగా భర్త హరికృష్ణ గ్యాస్ సిలిండర్ తీసుకురాకపోవడంతో భార్య మహాలక్ష్మికి కోపం తెప్పించింది. గ్యాస్ లేకుండా వంట ఎలా చేయాలని ఆవేదన చెందిన భార్య మహాలక్ష్మి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
మహాలక్ష్మిని వెంటనే కుటుంబ సభ్యులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మహాలక్ష్మి తాగిన ఫినాయిల్ ను డాక్టర్లు కక్కించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే భర్త ఏం చేస్తాడు… గ్యాస్ సిలిండర్ లేదని భర్త మీద కోపంతో ఫినాయిల్ తాగడం ఏంటి?అనుకుంటున్నారు ఇది తెలిసినవాళ్లు. ఆవేశంలో భార్య ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల గ్యాస్ కొరత వల్ల చాలామంది ఇంట్లోకి గ్యాస్ పొందటంలో ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా డెలివరీ అవ్వడానికి చాలా ఆలస్యం అవుతుంది. దీంతో గ్యాస్ ఏజెన్సీ వద్దకు నేరుగా వెళుతున్నారు. ఇక కొంతమంది నేరుగా గౌడౌన్ వద్దకు వెళ్లి తీసుకుంటున్నారు.
Also read
- రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
- నగరంలో నయా దళారులు.. సాఫ్ట్వేర్, రైల్వే ఉద్యోగుల మత్తు దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
- విద్యార్థినిపై అత్యాచారం కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. అసలు వీళ్లు గురువులేనా?
- పిల్లలిద్దరూ లండన్లో వెల్ సెటిల్డ్.. అయినా ఎందుకు ఆంటీ ఈ పనులు
- భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని భార్య ఆత్మహత్యాయత్నం.. చివరికి..?





