SGSTV NEWS online
Andhra PradeshCrime

ప్రియుడిని వదులుకోలేక కట్టుకున్న భర్తను కడ తేర్చే ప్రయత్నం.. సీన్‌ కట్‌ చేస్తే..



చిత్తూరు జిల్లాలో ప్రియుడి కోసం భర్త ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసిన భార్య అడ్డంగా దొరికిపోయింది. ఆర్మీలో పనిచేస్తున్న భర్త ను దూరం చేసుకుని ప్రియుడికి దగ్గర కావాలనుకుంది. ప్రియుడితో కలిసి భర్తపై హత్యయత్నానికి ప్రయత్నించింది. ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో ప్రియుడితో కలిసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.

చిత్తూరు జిల్లా పలమనేరులో భర్తను చంపేందుకు ప్రయత్నించిన భార్య యవ్వారం బయటపడింది. ఈ ఏడాది మే 16న పలమనేరు రూరల్ మండలం కోతిగుట్టకు చెందిన సి. వెంకటేశులుపై జరిగిన హత్యాయత్నం కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు శిల్ప నాటకాన్ని బయటపెట్టారు. కోతి గుట్టకు చెందిన వెంకటేశులు ఆర్మీలో పనిచేస్తుండగా బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామానికి చెందిన శిల్పతో 21 పెళ్లయింది. వెంకటేశులు, శిల్పా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు ఉండగా భార్య పిల్లలు గ్రామంలోనే ఉంటున్నారు. గత 10 ఏళ్ల కిందట ఆర్మీ కి వెళ్లిన వెంకటేశులు గ్రామంలో సొంత ఇళ్ళు కట్టి భార్య శిల్పకు చిల్లర దుకాణం పెట్టించాడు. ఇలా పిల్లలతో గ్రామంలోనే భార్య శిల్ప జీవితం సాఫీగా భర్త మాత్రం దేశ రక్షణలో ఆర్మీలో రాణిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే వెంకటేశులు ప్రతి ఏటా ఒకసారి సొంతూరు కు వచ్చి కుటుంబంతో నెల రోజులు పాటు గడిపి వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడే శిల్ప ట్రాక్ తప్పింది. పలమనేరు రూరల్ మండలం నూనె వారి పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. సమీపంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వెంకటేష్ తరచూ శిల్ప చిల్లర దుకాణానికి వచ్చిపోతూ పరిచయం మరింత దగ్గరయింది. గత నాలుగేళ్లుగా శిల్ప వెంకటేష్ మధ్య బంధం విడదీయరానిదిగా మారింది. స్థానికుల ద్వారా శిల్ప, వెంకటేష్ వ్యవహారం ఆర్మీ జవాన్ వెంకటేశులుకు తెలిసిపోయింది. భర్త, ప్రియుడు ఇద్దరి పేర్లు వెంకటేష్ కావడంతో శిల్ప తన యవ్వారం కొనసాగించింది. విషయం తెలుసుకుని భర్త వెంకటేశులు భార్య శిల్ప ను మందలించాడు. ముగ్గురు పిల్లలు ఉన్న తమ దాంపత్య జీవితానికి 20 ఏళ్ళు పూర్తయిందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా శిల్ప వెంకటేష్ మోజు లో ఉండిపోయింది.

విషయాన్ని ప్రియుడుతో షేర్ చేసుకుంది. భర్త వెంకటేశులు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. ఇక భర్త వెంకటేశులు బతికి ఉంటే ప్రియుడు వెంకటేష్ తో కలవలేనన్న నిర్ణయానికి వచ్చిన భార్య శిల్ప పక్కా ప్లాన్ చేసింది. ప్రియుడు వెంకటేష్ తో కలిసి పన్నాగం పన్నింది. ఈ నేపథ్యంలోనే మే నెలలో ఈ ఏడాది మే నెలలో ఆర్మీ నుంచి నెల రోజుల సెలవులో కుటుంబంతో గడిపేందుకు వచ్చిన భర్త వెంకటేశులు ను అంతమొందించే ప్రయత్నం అమలు చేసింది. మే 16 న భర్త వెంకటేశులు ఇంట్లో నిద్రపోతుండగా సరసల కాగే నూనె తీసుకొచ్చి శరీరంపై పోసింది. ఒక్కసారిగా శరీరం కాలిపోవడంతో భర్త వెంకటేశులు కేకలు వేస్తుండగా భార్య శిల్పా మాత్రం ప్రియుడు వెంకటేష్ తో ఎస్కేప్ అయ్యింది. చుట్టుపక్కన వాళ్లకు సమాచారం తెలియడంతో వెంకటేశులను ఆసుపత్రికి తరలించారు.



ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ వెంకటేశులు భార్య నిర్వాకాన్ని తన వాంగ్మూలంలో పోలీసులు వివరించాడు. ఈ మేరకు పలమనేరు రూరల్ పోలీసులు శిల్ప, ఆమె ప్రియుడు వెంకటేష్ లపై కేసు నమోదు చేశారు. 109(1),61(2) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక అప్పటినుంచి అజ్ఞాతంలోనే ఉన్న శిల్ప ఆమె ప్రియుడు వెంకటేష్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఇక ప్రియుడుతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఏకంగా కట్టుకున్న భర్తను అంతం చేయాలని నిర్ణయించుకుంది. వివాహ బంధాన్ని కాదనుకున్న భార్య శిల్ప ను A1, A2 ప్రియుడు వెంకటేష్ లను చిత్తూరు జైలుకు పంపించారు పోలీసులు. ఆర్మీ జవాన్ వెంకటేశులు దేశ రక్షణలో యధావిధిగా విధుల్లో కంటిన్యూ అవుతున్నారు

Also Read

Related posts