అది అర్ధరాత్రి సమయం.. అందరూ నిద్రపోతున్నారు. కానీ ఆ ఇంట్లో మాత్రం ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. భర్తకు ఇష్టమైన బిర్యానీలోనే భార్య చావును కలిపి ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రియుడితో కలిసి అతడిని ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు చూస్తే.. మనిషిలో ఇంతటి వికృత రూపం ఉంటుందా అనిపించక మానదు. అసలు ఏం జరిగిందంటే..?
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా ఆ తర్వాత ఆ మహిళ ప్రవర్తించిన తీరు పోలీసులనే విస్మయానికి గురిచేసింది. గుంటూరు జిల్లా చిలువూరులో ఈ దారుణం ఘటన చోటుచేసుకుంది. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజుకు, లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో మాధురికి గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన మాధురి పక్కా ప్లాన్‌తో అతడిని అంతమొందించింది.
నిద్రమాత్రలు.. బిర్యానీ.. దిండు..
ఈ నెల 18న రాత్రి భర్త కోసం బిర్యానీ వండిన మాధురి, అందులో 20 నిద్రమాత్రల పొడిని కలిపింది. భర్త గాఢ నిద్రలోకి వెళ్లగానే ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించింది. గోపి అతడి ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. భర్త చనిపోయిన తర్వాత ప్రియుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ మాధురి మాత్రం ఏమీ జరగనట్టు శవం పక్కనే కూర్చుని రాత్రంతా సెల్ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.
గుండెపోటు డ్రామా.. బయటపడ్డ అసలు నిజం
తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో చనిపోయాడని మాధురి ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే భర్తతో గొడవలు, వివాహేతర సంబంధం గురించి తెలిసిన చుట్టుపక్కల వారిని మాధురిని అనుమానించారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు వచ్చిన అతడి ఫ్రెండ్స్.. నాగరాజు చెవిలో రక్తాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. నివేదికలో నాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు, గాలి ఆడకపోవడం వల్లే మరణించినట్లు స్పష్టమైంది. పోలీసుల విచారణలో మాధురి తన నేరాన్ని అంగీకరించింది.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





