కత్తిపూడి నేషనల్ హైవేపై గురువారం (జనవరి 29) తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు అగ్నిక ఆహుతవగా.. ఒకరు సజీవ దహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్ తో వెళుతున్న లారీని వెనకనుంచి..
ప్రత్తిపాడు, జనవరి 29: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తిపూడి నేషనల్ హైవేపై గురువారం (జనవరి 29) తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు అగ్నిక ఆహుతవగా.. ఒకరు సజీవ దహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్ తో వెళుతున్న లారీని వెనకనుంచి కంటైనర్ లారీ వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు లారీల క్యాబ్‌లు అగ్నికి హాహుతయ్యాయి.
ఈ ఘటనలో కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. అయితే రెండు లారీల డ్రైవర్లు మాత్రం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు గమనించి ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలను అదుపు చేసింది. దీనిపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





