SGSTV NEWS
Andhra PradeshCrime

ఆ ఊర్లో గుడులే టార్గెట్.. ఒకేసారి మూడు దేవాలయాల్లో దొంగలు చోరీ! వీడియో వైరల్‌



సీసీ కెమెరాలు ఉన్న లేకున్నా సరే.. ఆ ఊర్లో టార్గెట్ రీచ్ అవుతూ వెళ్తున్నారు దొంగలు.. హుండీలు ధ్వంసం చేస్తున్నారు. నగదు దోచుకు వెళ్తున్నారు. అవకాశం ఉన్నచోట దేవుళ్లకు వేసిన ఆభరణాలను సైతం అపహరిస్తున్నారు. శైవ క్షేత్రాలలో ప్రముఖమైన కాల్వ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ మరువకముందే..

కర్నూల్, జులై 26: ఆలయాలే టార్గెట్ గా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దోపిడి దొంగలు చెలరేగిపోతున్నారు. సీసీ కెమెరాలు ఉన్న లేకున్నా సరే.. టార్గెట్ రీచ్ అవుతూ వెళ్తున్నారు. హుండీలు ధ్వంసం చేస్తున్నారు. నగదు దోచుకు వెళ్తున్నారు. అవకాశం ఉన్నచోట దేవుళ్లకు వేసిన ఆభరణాలను సైతం అపహరిస్తున్నారు. శైవ క్షేత్రాలలో ప్రముఖమైన కాల్వ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ మరువకముందే ఎమ్మిగనూరు దగ్గర ఒకేసారి మూడు ఆలయాలలో చోరీ చేసి దోపిడి దొంగలు పోలీసులకు సవాల్ విసిరారు.



కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆలయాలు టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టించారు. మండల పరిధిలోని ఎర్రకోట, సిరాలదొడ్డి, ఎమ్మిగనూరు సమీపంలో ఉన్న బాట మారమ్మ, మరో రెండు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో దొంగలు చోరీ చేశారు. ఆలయాల్లో ఉన్న హుండీలను పగలకొట్టి, అందులో ఉన్న నగదు, ఆలయాల్లో ఉన్న గుడి గంటలను, స్పీకర్లను అపహారించారు. ఓ ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చోరీ చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రధాన రహదారుల్లో ఉన్న ఆలయాల్లోనే దొంగతనాలు జరిగితే, మరి శివారులో ఉన్న ఆలయాల పరిస్థితి ఏమిటని? ఇప్పటికైనా దేవాలయాలకు రక్షణ కల్పించాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు కోరారు.


Also read

Related posts

Share this