SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: ఆలయ ఈవోనే అమ్మవారిని నగలను తస్కరించాడు.. ఆపై..



గుడికి సంబంధించిన అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కార్యనిర్వాహణ అధికారిది. కానీ ఆయనే గుడిలోని అమ్మవారి నగలను ఎత్తుకెళ్లిపోతే. అలాంటి ఘటనే జరిగింది సత్యసాయి జిల్లాలో. అమ్మవారి విలువైన వస్తువులు తీసుకెళ్తుండగా పట్టుకున్న భక్తులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ..



అమ్మవారి ఆభరణాలను కాపాడాల్సిన దేవాలయ ఈవోనే.. అదే ఆభరణాలపై కన్నేసి దొంగతనానికి దిగితే? ఆ దేవత భక్తులు ఎలా వదిలేస్తారు చెప్పండి. అదే ఘటన జరిగింది కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి వద్ద. ఆలయం వద్దకు ఆటోలో వచ్చి సంచిలో ఐదు కేజీల వెండి ఆభరణాలు, అమ్మవారి విలువైన చీరలు, ఇతర విలువైన వస్తువులు తీసుకు వెళ్తుండగా భక్తులు, స్థానికులు పట్టుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భక్తులు ఆగ్రహంతో ఈవో మురళీకృష్ణ, అతని కుటుంబ సభ్యులను కూడా ఆటోతో పాటు అట్టడుగు వరకు లాగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి… మొత్తం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులను తీవ్రంగా విమర్శిస్తూ వెంటనే ఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read

Related posts