SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: వామ్మో… క్షణాల్లో ఘోరం జరిగేది… సమయానికి ఎస్‌ఐ చూడబట్టి సరిపోయింది




ప్రకాశం జిల్లా దర్శి–కురిచేడు రోడ్డులోని సాగర్ ప్రధాన కాలువ వద్ద కలకలం రేగింది. కుటుంబ కలహాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ వివాహిత తన రెండేళ్ల కొడుకుతో కలిసి హఠాత్తుగా కాలువలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయగా, అదే సమయంలో అటుగా వెళ్తున్న దర్శి ఎస్‌ఐ మురళి వెంటనే స్పందించారు.

అది ప్రకాశం జిల్లా దర్శి – కురిచేడు రోడ్డులోని సాగర్‌ ప్రధాన కాలువ. రోడ్డు వెంటనే కాలువ ఉంటుంది. అప్పటి వరకు కాలువవైపు తీక్షణంగా చూస్తూ తీవ్రమనోవేదనతో ఉన్న ఓ వివాహిత మహిళ తన రెండేళ్ల కొడుకుతో సహా హఠాత్తుగా కాలువలోకి దూకేసింది. అది చూసిన చుట్టుపక్కల వాళ్లు కేకలు వేశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న దర్శి ఎస్‌ఐ మురళి విషయం తెలిసి.. పరుగు పరుగున వచ్చారు. వెంటనే కాలువలోకి దూకిన తల్లి, ఆమె రెండేళ్ల కొడుకును స్ధానికుల సాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. తల్లి క్షేమంగానే ఉన్నా, బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జిజిహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు… భర్తతో గొడవపడిన మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు తన రెండేళ్ల కొడుకుతో సహా కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్టు గుర్తించారు.

భర్తతో గొడవపడి క్షణికావేశంలో రెండేళ్ల బాలుడితో కలిసి సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వివాహితను దర్శి ఎస్‌ఐ మురళి సమయస్పూర్తితో కాపాడటంతో తల్లీ, బిడ్డలు క్షేమంగా బతికి బయటపడ్డారు. ఈ ఘటన దర్శి-కురిచేడు రోడ్డులోని సాగర్ ప్రధాన కాలువలో జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ దర్శి ఎస్‌ఐ మురళి అటునుంచి వెళుతుండగా గమనించి సహాయక చర్యలు వేగంగా తీసుకోవడంతో ఇద్దరి ప్రాణాలు దక్కాయి.. ప్రకాశం జిల్లా దర్శి మండలం మారెడ్డిపల్లికి చెందిన ఓ వివాహిత మహిళ కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైంది… భర్తతో గొడవపడి తన రెండేళ్ల కొడుకును తీసుకుని కురిచేడు రోడ్డులో ఉన్న సాగర్‌ కాలువ దగ్గరకు వచ్చింది… కొద్దిసేపు అంతర్మదనానికి లోనైన వివాహిత చివరకు తన కొడుకుతో సహా కాలువలోకి దూకేసింది… వెంటనే సమీపంలోని స్థానికులు కొందరు గమనించి కాలువలో దూకిన మహిళను కాపాడే ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సై మురళి వెంటనే స్పందించారు… స్థానికుల సాయంతో కాలువలో దూకిన మహిళను, ఆమె బిడ్డను ఒడ్డుకు చేర్చారు… వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందేలా చేశారు… మహిళ వెంటనే తేరుకోగా బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు… ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ఎస్‌ఐ మురళి తెలిపార.. సకాలంలో స్పందించి తల్లీబిడ్డలను కాపాడిన ఎస్‌ఐని ప్రజలు అభినందించారు.

Also Read

Related posts