చదువులేని అమాయకపు వ్యక్తి నమ్మకాన్ని పణంగా పెట్టాడు. పాలుపోసే వ్యక్తి పేరుతో ఎస్బీఐలో బులియన్ అకౌంట్ తెరిచాడు. అతనికి తెలియకుండా ఏకంగా కోట్లలో బంగారం బిజినెస్ చేశాడు. నెల్లూరు జిల్లా కందుకూరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో పాలుపోసే వ్యక్తి పేరుతో బ్యాంకు అకౌంట్ తెరిచాడు. కోట్ల రూపాయల అక్రమ బంగారం వ్యాపారం నిర్వహించిన రిటైర్డ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నత అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన డోగిపర్తి వెంకట కోట సాంబశివరావు చదువు లేని అమాయకపు వ్యక్తి గల్లా రమణయ్య పేరుతో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా కందుకూరు శాఖలో నవంబర్ 21, 2024న బులియన్ అకౌంట్ తెరిచాడు. సుకన్య ట్రేడర్స్ పేరుపై ఖాతా తెరిచిన సుమారు 5 కోట్ల రూపాయల మేర బంగారం కొనుగోళ్లు నిర్వహించాడు. సుకన్య ట్రేడర్స్కు తన ఇంటి చిరునామా ఇచ్చిన సాంబశివరావు లావాదేవీలు నిర్వహించాడు.
కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్నప్పటికీ గల్లా రమణయ్య బ్యాంకుకు ఎప్పుడూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ రమణయ్యను తీసుకుని రావాలని కోరాడు. తప్పని పరిస్థితులలో సాంబశివరావు, రమణయ్యను బ్యాంకు మేనేజర్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. బ్యాంకు మేనేజర్ అడిగే ప్రశ్నలకు రమణయ్య సమాధానం చెప్పలేక, ఎదో తప్పు జరుగుతూ ఉందని గమనించి తన అకౌంట్ రద్దు చేయాలని చెప్పి బ్యాంకు నుండి వెళ్ళిపోయాడు. రమణయ్య శుక్రవారం (అక్టోబర్ 31) రాత్రి సాంబశివరావు ఇంటికి వెళ్లి నిలదీయడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది.
గత 40 సంవత్సరాలుగా రమణయ్య కుటుంబం సాంబశివరావుకు పాలు పోస్తుండటంతో రమణయ్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సాంబశివరావు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడ్డాడు. సాంబశివరావు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూనే జీవిత భీమా ఏజెంట్, పోస్టల్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుండేవాడు. పోలీసులకు సమాచారం అందటంతో బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి లావాదేవీల వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- Telangana: ప్రేమించానన్నాడు.. శారీరికంగా కలిశాడు.. కట్ చేస్తే.. పిల్లాడు పుట్టేసరికి
- ఇదేం పోయేకాలం రా.. ఇంట్లో పూజ చేసుకుంటున్న మహిళపై..!
- Garbarakshambigai: మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత వెలిసిన క్షేత్రం-‘గర్భరక్షాంబిక ఆలయం’, తిరుకరుకావుర్
- నేటి జాతకములు…3 నవంబర్, 2025
- వికారాబాద్లో దారుణం.. వదిన, భార్య, పిల్లలను కొడవలితో నరికి చంపి, ఆపై భర్త సూసైడ్!





