SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: “నాన్న జాగ్రత్త” అంటూ చేతిపై రాసుకున్న యువతి.. ఆపై..




ఏపీలోని మార్కాపురం జిల్లా పామూరు మండలం అయ్యవారిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆమె అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో మాధవి(24) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు మాధవి “నాన్న జాగ్రత్త” అంటూ తన అరచేతిపై రాసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.


డిగ్రీ వరకు చదివిన మాధవి, ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో నాగూర్ భాష అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారితీసింది. అప్పటికే నాగూర్ భాషకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మాధవి.. నాగూర్ బాషను దూరం పెట్టింది. దీంతో మాధవిపై నాగూర్‌ కోపం పెంచుకున్నాడు… తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు… దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎక్కడ తన పరువుతో పాటు తన తండ్రి పరువు కూడా పోతుందని భయపడిపోయింది… తన అరచేతిలో ‘నాన్న జాగ్రత్త’ అని రాసుకుని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవి మృతికి కారణమైన నాగూర్‌బాషాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాని మాధవి బంధువులు కోరుతున్నారు. మాధవి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తనకు అన్యాయం చేసినవాడిపై తిరగబడి పోరాడాలే కానీ, ఇలా ఆత్మహత్య చేసుకుంటే నష్టపోయేది మన కుటుంబమే కదా… అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also read

Related posts