ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఇదే విధంగా చేస్తున్నాడని తెలిపింది. అంతేకాకుండా డ్యూటీ వేసే అంశంలో ఇష్టమొచ్చినట్లు షిఫ్టులు మారుస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. అధికారి వినిపించుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన లక్ష్మీ తిరుపతమ్మ ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. ఎక్స్ సర్వీస్ మెన్‌గా ఉన్న భర్త చనిపోవడంతోనే ఆమెకు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే అవకాశం కల్పించారు. ఉద్యోగం రావడంతో మంగళగిరి మండలం యర్రపాలెంకు నివాసం మార్చుకుని పిల్లలతో కలిసి అక్కడే జీవిస్తోంది. అయితే గత కొంతకాలంగా చీఫ్ సెక్యూరిటీ అధికారిగా మోహనాచారి ఆమెపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగివేసాగిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఇదే విధంగా చేస్తున్నాడని తెలిపింది. అంతేకాకుండా డ్యూటీ వేసే అంశంలో ఇష్టమొచ్చినట్లు షిఫ్టులు మారుస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే వేధింపులకు గురి చేయవద్దని పిల్లలున్నారని వేడుకున్నా మోహనాచారి కనికరించలేదని తెలిపింది. పైగా షిఫ్టులకు సరిగా హాజరు కావడం లేదంటూ ఆమెను ఉద్యోగంలో నుండి తొలగిస్తున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ తిరుపతమ్మ మూడు రోజుల క్రితం సెక్యూరిటీ అధికారి కార్యాలయానికి వెళ్లి ఉద్యోగం ఇవ్వాలంటూ వేడుకుంది. అధికారి వినిపించుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను ఎయిమ్స్ లో చేర్పించారు. అయితే కేసు నమోదు చేయాల్సి ఉండగా వద్దంటూ మోహనాచారి అడ్డుకున్నాడు. అయితే ఆమెకు ట్రీట్ మెంట్ చేస్తున్న వైద్యుడు వెంటనే ఎమ్మెల్సీగా నమోదు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అప్పటి నుండి తోటి ఉద్యోగులను పంపి ఆమెను మరోసారి బెదిరింపులకు దిగాడు. ఆమెకు సాయం చేస్తున్నారంటూ మరికొంతమందిపై చర్యలు తీసుకునేందుకు మోహనాచారి సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుండి ఢిఛార్జ్ అయిన లక్ష్మీ తిరుపతమ్మ తన తండ్రితో కలిసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన మోహనాచారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వీడియో కాల్ చేసిన ఆధారాలను బయటపెట్టింది. దీంతో మోహనాచారిపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక ఆరోపణలు రావడమే కాకుండా మహిళ కేసు నమోదు చేయకుండా అడ్డుపడిన అధికారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also read
- ఛీ.. ఛీ.. ఇదేం పని రా.. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులా..?
- శ్రీశైలంలో మహా అపచారం: గర్భగుడిలో మల్లికార్జున స్వామి వీడియో తీసిన భక్తుడు.. సోషల్ మీడియాలో వైరల్!
- Karimnagar SI : గన్నేరు పప్పు తిని భార్య మృతి.. మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న SI
- kakinada: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. కోతుల దాడిలో వృద్ధురాలి మృతి
- సినిమా స్టంట్‌ను తలపించిన స్కార్పియో యాక్సిడెంట్





